టమోటో గింజల్లో నిజంగానే విషం ఉంటుందా..?

-

టమాటో లేకుండా వారం కూడా గడవదు.. వంటల్లో విరివిగా వాడతారు.. టమోటా గుడ్డు, టమోటా పచ్చడి, టమోటా పప్పు, ఇంకా ఇవి చాలనట్లు.. టమోటాతో కాంబినేషన్స్‌ కూడా. ఇలా టమాటోను మనం మనకు తెలియకుండా బాగా తింటాం.. పైగా ఉన్న కూరగాయాల్లో ఇదే తక్కువ ధరకు వస్తుంది. అందిరి ఇళ్లలో టమోటా, గుడ్లు, ఉల్లిపాయలు మాత్రం సంవత్సరం పొడవుగా ఉంటాయి.. కానీ మీకు తెలియని ఓ ఇంట్రస్టింగ్‌ విషయం ఏంటంటే.. టమోటా గింజలు చాలా డేంజరట..! విషంతో సమానమట.. ఇందులో నిజమెంత..?కేవలం పుకారేనా..? ఆ వివరాలు చూద్దాం..
పుల్లగా ఉండే టమాటాలు కూరకు మంచి రుచి ఇవ్వడమే కాదు.. రంగుని కూడా ఇస్తాయి. ఇవి క్యాన్సర్ సహా చాలా రకాల రోగాలను అడ్డుకొని, ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి మనం టమాటాలను తప్పక కూరల్లో వాడుతాం. మరి టమాటా గింజలు మనకు హాని చేస్తాయా? టమాటా గింజల్లో లైకోపీన్ (Lycopene) అనే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది కణాల నిర్మాణంలో సాయపడుతుంది. అంతేకాదు.. ఇది గుండె, కిడ్నీల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అలాగే మన శరీరం కాల్షియంని గ్రహించేలా చేస్తుంది. టమాటా గింజలు మన చర్మానికి కూడా మేలు చేస్తాయి.
టమాటా గింజలు చిన్నగా ఉన్నా.. వాటిలో సీ విటమిన్, న్యూట్రీషనల్ ఫైబర్ ఉంటుంది..ఇవి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తాయి. పొట్టకు మేలు చేస్తాయి. బాడీలో వివిధ బాగాలు బాగా పనిచేసేందుకు సహకరిస్తాయి. శరీరానికి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్‌ను ఇవి ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి.

అది అవాస్తవం..

టమాటా గింజల్లో విషం ఉంటుందనీ, ఇవి తినకూడదనీ అసత్య ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ గింజల్లో విషం అన్నదే లేదు..టమాటాలలో కూడా విషం ఉండదు. మరైతే ఈ ప్రచారం ఎందుకు జరుగుతోంది అంటే.

విషం ఉంటుంది..

టమాటా మొక్కలో సొలానైన్ (Solanine) అనే విషపూరిత ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది మొక్క కాండం, ఆకుల్లో ఎక్కువగా ఉంటుంది. టమోటా మొక్క పెరుగుదలకు సాయపడుతుంది. ఈ విషం కారణంగా.. టమాటా మొక్కల జోలికి జంతువులు రావు. అలా ప్రకృతి ఈ మొక్కలకు రక్షణ కల్పిస్తోంది. అంతే కానీ.. ఆ విషం టమాటాకు ఎక్కదు.. టమోటాలోకానీ, టమోటా గింజల్లో కానీ ఎలాంటి విషం ఉండదు. అయితే టమాటో గింజలను ఎక్కువగా తినడం మంచిది కాదు..ముఖ్యంగా కడుపులో గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారు టమాటా గింజలకు దూరంగా ఉండాలి. అలాంటి వారికి ఈ గింజల వల్ల గుండె మంట వస్తుంది. వారి జీర్ణక్రియపై ఈ గింజలు నెగెటివ్ ప్రభావం చూపిస్తాయి. పైగా ఇవి అరగాడనికి ఎక్కువ టైమ్‌ పడుతుంది కాబట్టి.. వీలైనంత తక్కువగా తినేందుకు ట్రే చేయండి.. !

Read more RELATED
Recommended to you

Latest news