ప్లాస్టిక్‌ స్ట్రాతో డ్రింక్స్‌ తాగుతున్నారా..? బరువు పెరగడం, వృధ్యాప్యం రావడం ఖాయం..!

-

ప్లాస్టిక్‌ వాడొద్దని ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా మనం వినడం లేదు. తెలిసి వాడేది కొంతైతే..తెలియకుండా వాడేది మరికొంత.. బయట కొబ్బరిబోండాం కొట్టించుకోని నీళ్లు తాగుతాం.. కొబ్బరినీళ్లు మంచివే.. కానీ వాటిని ఎలా తాగుతున్నాం.. ప్లాస్టిక్‌ స్ట్రాలో.. ఇంకేముంది లాభం.. స్ట్రాను ఉపయోగించి ఏదైనా తాగినప్పుడు, అది నేరుగా మీ దంతాలు, ఎనామిల్‌ను తాకుతుంది. ఇది మీ మోలార్‌లను దెబ్బతీస్తుందట..

మనం సాధారణంగా శీతల పానీయాలు తాగడానికి ప్లాస్టిక్ స్ట్రాని ఉపయోగిస్తాము. కానీ, ఇదే ప్లాస్టిక్ స్ట్రా ఆరోగ్యానికి, అందానికి హాని చేస్తుందని మీరెప్పుడైనా ఆలోచించారా..? ఈ ప్లాస్టిక్ స్ట్రాస్ ద్వారా జ్యూస్‌లు, కూల్‌డ్రింక్స్‌ వంటివి తాగితే, మీరు తాగాల్సిన దానికంటే ఎక్కువ తాగుతారు. అటువంటి పరిస్థితిలో అధిక కేలరీల కూల్‌డ్రింక్స్‌, జ్యూస్‌ మీకు తెలియకుండానే తాగేస్తుంటారు. ఇలాంటి చిన్న సిప్స్ మీరు బరువు పెరిగేలా చేస్తుందట..
ఇది ఆకలిని పెంచుతుంది. శరీరానికి హాని చేస్తుంది. ప్లాస్టిక్ స్ట్రా ఉపయోగించడం వల్ల ఇంకా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్లాస్టిక్‌ స్ట్రాలు వాడే వారిలో నోటి వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది. దంత క్షయం, కుహరం, ఇతర నోటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, ఎరేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల వస్తాయని నిపుణులు అంటున్నారు.. ఇలాంటి సమస్యలు స్ట్రా సహాయంతో కూడా సంభవించే ప్రమాదం ఉందంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.
శరీరంలోకి విష రసాయనాలు చేరే ప్రమాదం ఉంటుంది. ప్లాస్టిక్ స్ట్రాలు పాలీప్రొఫైలిన్‌తో తయారు చేయబడతాయి. మీరు స్ట్రాస్ నుండి డ్రింక్స్ తాగినప్పుడు అది నేరుగా మీ శరీరంలోకి వెళ్లడం ద్వారా మీ శరీరంలోని హార్మోన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుందట..ప్లాస్టిక్‌ స్ట్రా ఎక్కువగా వాడే వారు తెలియకుండానే బరువు పెరగుతారు. ప్లాస్టిక్ స్ట్రాలతో మీరు జ్యూస్, కోల్డ్ కాఫీ తాగుతుంటారు. దీని వల్ల మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇది మీ ఆకలిని కూడా బాగా పెంచుతుంది.
ప్లాస్టిక్ స్ట్రాలు ఎక్కువగా వాడేవారిలో తొందరగా వృద్ధాప్య సంకేతాలు బయటపడుతున్నాయని తాజా నివేదికల ద్వారా తెలిసింది..మీరు స్ట్రా ను ఉపయోగించి ఏదైనా డ్రింక్ ను ఎక్కువసార్లు పీల్చుకున్నప్పుడు మీ ముఖంపై ముడతలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. చిన్న స్ట్రా పెద్ద నష్టాన్నే తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇప్పటినుంచి అయినా ప్లాస్టిక్‌ స్ట్రా వాడేముందు జర ఆలోచించండి.!

Read more RELATED
Recommended to you

Latest news