సహజంగా చాలా మందికి భోజనం చివరిలో పెరుగు తినకపోతే ఏదో వెలుతుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరి కొందరికి పెరుగు తినడం వల్ల అధిక బరువు మరియు బద్దకం పెరుగుతారని తినడమే మానేస్తారు. అయితే నిజానికి పెరుగు ఎలాంటి వ్యాధినయినా నివారిస్తుంది. పెరుగులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి. ఆరోగ్యాన్ని ‘కవచం’లా కాపాడే ‘పెరుగు’ను వరంగా భావించవచ్చు.
పెరుగు వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. మరి పెరుగు తినడం వల్ల ఉపయోగాలు తెలిస్తే ఎవరు కూడా దీని తినడం మానరు. మరి అవేంటో ఓ లుక్కేయండి..
- పెరుగులో ఉండే ల్యాక్టో బాసిల్లస్ అనే బ్యాక్టీరియా శరీరంలో బి మరియు టి వంటి తెల్ల రక్తకణాలను పెంచడంలో సహాయపడుతుంది. మరియు పెరుగు మన శరీరానికి కావల్సిన విటమిన్ కె అందిస్తుంది.
- పెరుగు తినడం వల్ల ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందిస్తాయి. మరియు తక్షణ శక్తిని అందిస్తాయి.
- కడుపులో అల్సర్ ఉండే వారిలో, గ్యాస్ట్రిక్ ఇరిటెషన్ తో బాధపడేవారికి, హైపర్ ఎసిడిటీతో బాధపడేవారికి పెరుగు అత్యద్భుతమైన ఫలితాన్నిస్తుంది.
- క్యాన్సర్ కణాలను అడ్డుకునే శక్తి పెరుగులో ఉంటుంది. అందుకే దీన్ని ప్రతి రోజు తీసుకోవడం మంచిది.
- చర్మం సౌందర్యానికి కూడా పెరుగు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ, జింక్, ఫాస్పరస్, మరియు ఇతర మైక్రో మినిరల్స్ చర్మాన్ని అందంగా మరియు కాంతివంతంగా తయారుచేస్తుంది.
- నిద్రపట్టని వారికి పెరుగు బాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో పెరుగు నిద్ర పట్టని వారికి వాడమని కూడా వెల్లడించారు.
- పెరుగు బ్లడ్ ప్రజర్‌ను కంట్రోల్ చేయడంలోబాగా సహయపడుతుంది. మరియు ప్రతి రోజు పెరుగు తినవడం వల్ల రక్తప్రసవరణ బాగా జరిగి గుండె జబ్బులు రాకుండా రక్షిస్తుంది.
- ప్రతి రోజూ పెరుగును ఆహారంలో భాగంగా తీసుకుంటే వయసు కనిపించదు. శరీరం లోని కణాలకు క్షీణత కనిపించకుండా యవ్వనంగా ఉంటాము.
- అలాగే పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుతుంది. మరియు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా పెరుగు సహాయపడుతుంది. ఇందుకు కనీసం రోజుకి రెండుసార్లయినా పెరుగు తినడం ఎంతో మంచిది.