రంజాన్ ఈ సంవత్సరం మార్చి 22న మొదలయింది. ఏప్రిల్ 21 వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ నెల అంతా కూడా ముస్లింలు ఉపవాసం చేస్తారు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం దాకా ఏమీ తినకుండా ఉంటారు. సాయంత్రం ఆహారాన్ని తిని ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో పవిత్రంగా వారి యొక్క పద్ధతుల్ని పాటిస్తారు.
మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో ముస్లింలు కూడా ఎంతో పవిత్రంగా రంజాన్ ని భావించి నియమ నిబంధనలను అనుసరిస్తూ ఉంటారు. మతసామరస్యానికి జరుపుకునే పండుగ రంజాన్ ని అభివర్ణిస్తారు. ఉదయం నుండి సాయంత్రం దాకా కాళీ కడుపుతో కఠిన ఉపవాసాన్ని చేస్తారు.
రంజాన్ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉపవాసం గురించి సైన్స్ కూడా కొన్ని విషయాలను చెబుతోంది. ఉపవాసం ఉంటే శరీరంతో పాటుగా మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుందని సైన్స్ అంటోంది.
రంజాన్ ఉపవాసం వలన కలిగే లాభాలు ఇవే:
మెదడు శక్తిని పెంచుతుంది:
ఉపవాసం చేయడం వలన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు సరిగ్గా పని చేస్తుంది మెదడు శక్తిని పెంచుకోవడానికి కూడా అవుతుంది.
ఒత్తిడి కొలెస్ట్రాల్ సమస్యలు ఉండవు:
ఉపవాసం చేస్తే ఒత్తిడి, కొలెస్ట్రాల్ ఇబ్బందులు కూడా ఉండవు. ఉపవాసం చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక రక్తపోటును కూడా తగ్గించవచ్చు.
షుగర్ పేషెంట్లకు మంచిదే:
రంజాన్ ఉపవాసం చేస్తే షుగర్ పేషెంట్లకు కూడా మంచిదే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి కానీ షుగర్ పేషెంట్లు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
వాపు తగ్గుతుంది:
శరీరం ఇన్ఫెక్షన్ తో పోరాడితే వాపు కలుగుతుంది ఉపవాసం వాపు ప్రమాదాన్ని తగ్గిస్తుంది క్యాన్సర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ మంట వస్తుంది ఇలాంటి మంటను తగ్గించుకోవాలంటే ఉపవాసం మంచిదే.
బరువు తగ్గొచ్చు:
ఉపవాసం వలన క్యాలరీలు తగ్గుతాయి. కొవ్వు వేగంగా కరుగుతుంది. బరువుని కోల్పోవడానికి అవుతుంది.