పెళ్ళి చేసుకోబోతున్నారా..? మీ భాగస్వామిలో ఈ లక్షణాలు ఉంటే మీరు అదృష్టవంతులే..

-

పెళ్ళంటే రెండు జీవితాల కలయిక మాత్రమే కాదు. రెండు కుటుంబాల కలయిక కూడా. అప్పటి వరకూ మనకు తెలియని వ్యక్తులు కూడా పెళ్ళితో మన ప్రాణ సమానులైపోతారు. అదే పెళ్ళిలో ఉన్న బలం అంటే. అందుకే ఎన్ని మారినా పెళ్ళి చేసుకోవడాలు ఆగిపోవడం లేదు. ఆగిపోవు కూడా. ఐతే మీ భాగస్వామిలో ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవ్వంతులు. ఆ లక్షనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిమ్మల్నిఅమితంగా ప్రేమిస్తారు. ఆ విషయం వారి చర్యల ద్వారా తెలుస్తుంది కూడా. మీకు సర్పైజ్ ఇవ్వడంలో ముందుంటారు. మీరు వాళ్లకేమీ ఇవ్వకపోయినా దాని గురించి పెద్దగా మాట్లాడరు.

మీ గురించి అవతలి వారి ముందు తక్కువ చేసి మాట్లాడరు. ఎవరైనా మాట్లాడిన ఊరుకోరు. మీరెలా ఉన్నా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు.

మీరు కష్టకాలంలో ఉంటే వాటి నుండి బయటపడడానికి తోడ్పడతారు. ఎలాంటి ఇబ్బందులెదురైనా మిమ్మల్ని వదిలి వెళ్ళరు.

మీ మౌనాన్ని అర్థం చేసుకుంటారు. మీరు బాధపడడానికి కూడా స్వేఛ్ఛనిస్తారు. ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని వారికి తెలుసు. మీ అత్యంత వ్యక్తిగత జీవితం గురించి ఆరాలు తీయరు. అలాగే తమ వ్యక్తిగత జీవితం గురించి అడగకూడదని అనుకుంటారు.

మిమ్మల్ని బాధపెట్టే విషయాలని మీకు చెప్పరు. దానివల్ల మీరు ఇబ్బంది పడటం ఇష్టం ఉండదు. కావాల్సి వస్తే మీకు తెలియకుండానే ఆ ఇబ్బందిని దూరం చేయాలని ప్రయత్నిసారు.

ఎదుటివాళ్ళతో అస్సలు పోల్చి చూడరు. మీకు అత్యంత గౌరవం ఇస్తారు. తన వల్ల మీకు ఇబ్బంది కలుగుతున్నట్లయితే స్వఛ్ఛందంగా తప్పుకోవాలని చూస్తారు తప్పితే, రచ్చ చేయాలని అనుకోరు.

Read more RELATED
Recommended to you

Latest news