అర్ధరాత్రిపూట ఎక్కువ ఆకలి వేస్తోందా..? అయితే వీటిని తీసుకోండి బరువు కూడా పెరగరు..!

-

ఒక్కొక్కసారి అర్ధరాత్రి పూట ఆకలి వేస్తుంది. అయితే అర్ధరాత్రి పూట ఆకలి వేస్తోంది కదా అని ఏమైనా ఎక్కువ తింటే లావు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే అర్ధరాత్రి పూట మీకు కూడా ఎక్కువ ఆకలి వేస్తోందా..?

ఆ సమయంలో ఏమైనా తిన్నా బరువు పెరిగి పోకుండా ఉండాలి అని అనుకుంటున్నారా..? అయితే వీటిని తీసుకోండి. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. అలానే బరువు పెరిగి పోవడం లాంటి సమస్యలు కూడా ఉండవు. అయితే మరి ఆ ఆహార పదార్థాల గురించి చూద్దాం.

యోగర్ట్:

కొవ్వులేని యోగర్ట్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలి లేకుండా చేస్తుంది. అలానే దీనిని తీసుకోవడం వల్ల బరువు పెరిగరు కూడా. దీనిని తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది. అలానే గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా ఉండవు. ఒకవేళ మీకు తియ్యగా తినాలనిపిస్తే ఇందులో బ్లూ బెర్రీస్ ని వేసుకొని తీసుకోండి.

ఆపిల్ మరియు పీనట్ బటర్:

ఆపిల్ ఎప్పుడూ కూడా మంచి స్నాక్ అని చెప్పవచ్చు. ఒక చిన్న ఆపిల్ లో కొద్దిగా పీనట్ బటర్ వేసుకుని తీసుకోండి. ఇది చాలా మంచి కాంబినేషన్ దీనిని తీసుకోవడం వల్ల కూడా బరువు పెరిగి పోకుండా ఉంటారు.

అరటి పండ్లు:

రాత్రిపూట ఆకలి వేస్తే అరటి పండ్లు కూడా తీసుకోవచ్చు. అరటి పండ్లలో పొటాషియం, విటమిన్ బి 6, విటమిన్ సి మరియు ఫైబర్ ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల కూడా లావైపోరు.

బాయిల్డ్ ఎగ్:

ఉడికించిన గుడ్డు కూడా రాత్రి పూట తీసుకోవచ్చు. అర్ధరాత్రి పూట ఆకలి వేసినప్పుడు దీనిని తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది కలగదు. ఇలా అర్ధరాత్రిపూట ఆకలి వేసినప్పుడు వీటిని తీసుకోండి దీనితో బరువు పెరిగిపోవడం ఉండదు. ఆరోగ్యం కూడా దెబ్బ తినదు.

Read more RELATED
Recommended to you

Latest news