పీఎం మిత్రలో చేరండి..కేసీఆర్‌కు కిష‌న్‌రెడ్డి లేఖ‌

-

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్‌నేతలు ఓ వైపు.. మ‌రొక బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం త‌రుచూ కొన‌సాగుతుంది. కేంద్ర‌, రాష్ట్రాల మ‌ధ్య నిధుల వ్య‌వ‌హారం నుంచి రాజ‌కీయ విమ‌ర్శ‌ల వ‌ర‌కు ఈ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌న్న చందంగా ప‌రిస్థితి ఉంది. అయితే ఈ త‌రుణంలోనే కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. సీఎం మిత్ర‌లో చేరాల‌ని విజ్ఞ‌ప్తి చేసిన ఆయ‌న దాని కోసం ప్ర‌తిపాద‌న‌లు పంపించాల‌ని సూచించారు. వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హించ‌డానికి ఈ పీఎం మిత్ర కార్య‌క్ర‌మం ఎంతో ఉప‌యోగంగా ఉంటుందని పేర్కొన్నారు.

గ‌త నెల 15న రాష్ట్ర ప్ర‌భుత్వానికి కేంద్ర జౌళి, వ‌స్త్ర ప‌రిశ్ర‌మ శాఖ లేఖ రాసింద‌ని.. త‌న లేఖ‌లో గుర్తు చేసారు. మార్చి 15వ తేదీ వ‌ర‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపించాల‌ని కిష‌న్‌రెడ్డి కోరారు. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొన్ని ప‌థ‌కాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం వ్య‌తిరేకిస్తూనే ఉంది. అంత‌కంటే మిన్న‌గా త‌మ సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఉన్నాయ‌ని చెబుతూ వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో పీఎం మిత్ర‌లో చేరుతుందా లేదా కిష‌న్‌రెడ్డి రాసిన లేఖ పై కేసీఆర్ ఎలా స్పందిస్తార‌నేది ఆస‌క్తిక‌రం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news