కేరళ వెళ్తున్నారా..? అయితే ఈ ప్రదేశాలని మిస్ అవ్వద్దు..!

-

కేరళ చాలా అందమైన ప్రదేశం. చాలా మంది కేరళ వెళ్లాలని అనుకుంటుంటారు కేరళలో చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. మీరు కూడా కేరళ వెళుతున్నట్లయితే అసలు ఈ ప్రదేశాలని ని మిస్ కావద్దు. ఆహ్లాదకరమైన తీర ప్రాంతాలు అభయారణ్యాలు అరుదైన వన్యప్రాణులు ఇక్కడ కనపడతాయి. కేరళ దేవతల సొంత దేశం గా పేరుగాంచిన చోటు. ఇక్కడ ప్రకృతి కూడా అందని బాగా ఆకట్టుకుంటుంది. మీరు కనుక కేరళ వెళ్లాలనుకుంటే కచ్చితంగా ఈ ప్రదేశాలని చూడండి సోలో ట్రిప్ అయినా స్నేహితులతో కలిసి వెళ్లాలని లేదంటే హనీమూన్ కి అయినా సరే ఇది బాగుంటుంది మరి కేరళలో ఉన్న ఉత్తమ ప్రదేశాల గురించి ఇప్పుడు చూసేద్దాం.

మున్నార్:

మున్నార్ చాలా బాగుంటుంది. టీ ఎస్టేట్‌లు, ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్లు ఇక్కడ ఉంటాయి. హానీమూన్ కోసం చాలా మంది ఇక్కడకి వెళ్తూ వుంటారు. అద్భుతమైన జలపాతాలు కూడా బాగా ఆకట్టుకుంటాయి.

కన్నూర్:

ఇది కూడా ఎంతో బాగుంటుంది. భారతదేశంలోని అత్యంత పొడవైన ఆఫ్ బీట్ తీరప్రాంతలలో ఇది ఒకటి. హోమ్‌స్టే ఇవన్నీ కూడా ఇక్కడ ఎంజాయ్ చేయచ్చు.

వర్కాల బీచ్‌:

కేరళలో ఉన్న వర్కాల బీచ్ ని కూడా అస్సలు మిస్ అవ్వద్దు. సుందరమైన దృశ్యాలకు, ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. సాహసాలను కూడా ఆస్వాదించవచ్చు. విదేశాల నుంచి కూడా ఇక్కడకి చాలా మంది వస్తూ వుంటారు.

పెరియార్ టైగర్ రిజర్వ్:

ఇది కూడా చాలా మంచి ప్రదేశం. అరుదైన వన్యప్రాణులను చూడటానికి ఇది బాగుంటుంది. ఆసియా ఏనుగులు, బెంగాల్ పులులు, తెల్ల పులులు, పెద్ద పెద్ద ఉడుతలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి.

పొన్ముడి:

తిరువనంతపురం నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఇది వుంది. పచ్చని పచ్చిక బయళ్లు, జలపాతాలు, ఎత్తైన కొండలు తో ఈ ప్రదేశం ఎంతో చక్కగా ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news