తిన్నాక సెక్స్‌ చేస్తున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!!

-

శృంగారం అనేది మూడ్‌ వచ్చినప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు చేయాలి అనుకుంటారు. ఇది కరెక్టే కానీ..శృంగారం చేయడానికి సరైన సమయం ఒకటి ఉంటుంది. అలాగే చేయకూడని సమయం కూడా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేయొచ్చా లేకా ఫుల్‌గా తిన్నాక చేయొచ్చా..? శృంగారం ఏ సమయంలో చేస్తే మంచిది.. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు చేయాలా? కడుపు నిండిన తర్వాత చేయాలా? ఇలాంటి డౌట్స్‌ మీకూ వచ్చే ఉంటాయి.. అసలు తిన్నాక శృంగారం చేయొచ్చా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..!
ఇండియాలో ఎక్కువ మంది.. రాత్రిపూట సెక్స్ చేయడానికి ఇష్టపడతారు. రాత్రి గట్టిగా భోజనం చేసిన తర్వాత అన్ని పనులు ముగుంచుకుని మెుదలుపెడతారు. నిద్ర పోయేముందు తినేసి.. రొమాన్స్‌లోకి దిగుతారు. భోజనం చేశాక.. శరీరానికి బాగా శక్తి వస్తుందని, అందుకే ఆ సమయంలో శృంగారం చేస్తే.. రెచ్చిపోతారని కొంతమంది నమ్మకం. భోజనం జీర్ణమయ్యేందుకు కూడా సెక్స్ ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ అలా చేస్తే.. మంచిది కాదని నిపుణులు చెప్పేమాట.
relationships
భోజనం చేసిన తర్వాత సెక్స్ చేస్తే.. కడుపులో మంట ఏర్పడుతుంది. అది క్రమేనా అసిడిటీకి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే భోజనానికి సెక్స్‌కు మధ్య కనీసం రెండు గంటల గ్యాప్ ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అర్ధరాత్రి వేళలో సెక్స్ చేస్తే.. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట. కొన్ని ఆహారాల్లో కార్పోహైడ్రేట్ల స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. వాటితో కడుపులో గ్యాస్‌లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. భోజనం చేసిన తర్వాత.. శరీరం అత్యధిక రక్తాన్ని జీర్ణాశయానికి పంపుతుంది. దీంతో ఆహారం బాగా జీర్ణమవుతుంది. తిన్న వెంటనే సెక్స్ లేదా వ్యాయామాలు చేస్తే.. వికారం ఏర్పడుతుంది.

మధ్యాహ్నం భోజనం తర్వాత చేయొద్దు..

మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా సెక్స్ చేయోద్దు. అయితే మధ్యాహ్నం సమయంలో సెక్స్‌లో పాల్గొంటే.. చాలా మంచిదని నిపుణులు చెప్పే మాట. మధ్యాహ్నం సమయంలో విడుదలయ్యే వీర్యం నాణ్యతగా ఉంటుందట. సంతానం కోసం ట్రై చేసేవారు.. ఈ సమయాన్ని ఎంచుకోవాలి. మీరు రెండు గంటలకు లంచ్ చేసే అలవాటు ఉంటే.. కాస్త ముందుగానే చేసేయండి. మధ్యాహ్నం సమయంలో సెక్స్ ఎంజాయ్ చేయండి. రాత్రి 8 నుంచి 10 మధ్యలో కూడా శృంగారం మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే భోజనం టైమింగ్స్ మార్చుకుని.. ఇక ఎంజాయ్ చేయండి.
శృంగారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు చేస్తే.. రసవత్తరంగా ఉంటుందట. ఎర్లీ మార్నింగ్‌ పురుషులకు సెక్సువల్‌ థాట్స్‌ ఎక్కువగా వస్తాయట.. ఆ టైమ్‌లో చేస్తే.. పురుషాంగం సైతం సెక్స్‌కు బాగా సహకరిస్తుందట.

Read more RELATED
Recommended to you

Latest news