కేసీఆర్ బిగ్ డెసిషన్..సీపీఐకి ఎమ్మెల్సీ?

-

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్టులు వచ్చేలా ఉన్నాయి..అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ మిత్రపక్షాల కోసం త్యాగం చేసేలా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుని ఎం‌ఐ‌ఎం ఎం‌ఐ‌ఎం కోసం త్యాగం చేసిన విషయం తెలిసిందే. ఆ ఎమ్మెల్సీ సీటులో ఎం‌ఐ‌ఎంకు మద్ధతు ఇచ్చింది. ఇక తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల్కు జరగనున్నాయి. మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

cpi

ఈ నెలాఖరుతో ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్‌ల పదవీకాలం ముగియనుంది. దీంతో ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.  సంఖ్యా పరంగా చూస్తే మూడు స్థానాలు బీఆర్ఎస్‌కే దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంకా ఎమ్మెల్సీ అభ్యర్ధులని కే‌సి‌ఆర్ ప్రకటించలేదు. కానీ బి‌ఆర్‌ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..ఇందులో ఒకస్థానం మళ్ళీ నవీన్ కుమార్ కు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అలా ఇస్తే ఇంకా రెండు స్థానాలు మిగులుతాయి. ఇక వీటిల్లో ఒకటి మిత్రపక్షంగా ఉన్న సి‌పి‌ఐకి ఇవ్వాలని కే‌సి‌ఆర్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

మునుగోడు ఉపఎన్నిక నుంచి సి‌పి‌ఐతో బి‌ఆర్‌ఎస్ దోస్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ఉపఎన్నికలో సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలు..బి‌ఆర్‌ఎస్‌కు మద్ధతు ఇచ్చాయి..అందుకే బి‌ఆర్‌ఎస్ పది వేల మెజారిటీతో గెలిచింది. ఆ తర్వాత నుంచి సి‌పి‌ఐ..దాదాపు బి‌ఆర్‌ఎస్ మిత్రపక్షంగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో సి‌పి‌ఐ నేత చాడా వెంకటరెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి కే‌సి‌ఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిసింది.

ఇక మూడో ఎమ్మెల్సీ కోసం బి‌ఆర్‌ఎస్ లో పోటీ ఎక్కువ ఉంది. మోత్కుపల్లి నరసింహులు, అరికెల నర్సారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, చాడ కిషన్‌రెడ్డి, బిక్షమయ్యగౌడ్‌, బండి రమేశ్‌, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి..ఇలా ఎమ్మెల్సీ కోసం పోటీ పడేవారి లిస్ట్ పెద్దగానే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news