తినే ఆహారంలో ఈ తప్పులు చేస్తున్నారా ..?

-

సాధారణంగా తినే ఆహారం బాగా నమిలి నమిలి మింగాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ చాలామంది ఈ పద్ధతులను అస్సలు పాటించరు. తినే ఆహారంలో ఇలా అశ్రద్ద చేస్తే ఆ ప్రభావం జీర్ణాశయంపై పడుతుంది. కాబట్టి జీర్ణాశయం పై భారం పడకుండా ఉండాలి అంటే ఆహారం 36 సార్లు నమిలి తినాలట. అంటే నోట్లో ముద్ద పెట్టుకున్న ప్రతిసారి 36 సార్లు నమిలి తినాలి అంటే నోట్లో ఉన్న ఆహారం నీరు లాగా మారేవరకు నమిలి ఆ తర్వాత మింగాలన్న మాట. అప్పుడే ఆహారం సగం మన నోట్లోనే జీర్ణం అవుతుంది మిగతా సగం జీర్ణాశయం పై భారం పడకుండా జీర్ణం అవుతుందని వైద్యుల నుంచి శాస్త్రవేత్తల వరకు ఇదే చెబుతున్నారు

ఒకవేళ మనం సరిగా నమలకుండా మింగేస్తే.. ఆ భారం మొత్తం మన జీర్ణాశయం మీద పడుతుంది. ఇలాంటప్పుడు మొత్తం ఆహారం సరిగ్గా అరగదు. పోషకాలు కూడా సరిగా అందవు. ఆహారం బాగా నోట్లో అరగకుండా అలాగే మింగేస్తే ఒక్కొక్క సారి అది టాక్సిన్ (విషం )గా మారే అవకాశం కూడా ఉంది.ఇలా కనుక ఎక్కువగా జరిగితే మన జీర్ణశయం మెల్లగా దెబ్బతినే అవకాశం ఉంది.అందుకే బాగా నమిలి తినడానికి ప్రయత్నించండి.ఆహారాన్ని తినేటప్పుడు ప్రశాంతంగా తినాలి. మొబైల్స్, టీవీ చూడడం.. ఇతరులతో మాట్లాడడం కానీ,ఎక్కువగా ఆలోచించడం కానీ, కంగారుగా తినడం కానీ చేయకూడదు. మనం తింటున్న ఆహారాన్ని ఆస్వాదించుకుంటూ, బాగా నమిలి తీసుకోవాలి.అప్పుడే మనం తింటున్న ఆహారం మన శరీరానికి పడుతుంది. మన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

కాబట్టి ఆహారాన్ని పూర్తిగా నమిలి నీళ్లలాగా నింగినప్పుడే జీర్ణాశయంపై ఎటువంటి భారం పడదు. అప్పుడు అజీర్తి, ఎసిడిటీ , గ్యాస్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఏది ఏమైనా వైద్యులు అంత లేనిదే మనకు చెప్పరు కదా.

Read more RELATED
Recommended to you

Latest news