8 కాళ్లతో జన్మించిన వింత దూడ..దేవుడి మహిమే అంటూ ఎగబడిన జనం..

-

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో జరిగే వింతలను మనం చూస్తూనే ఉన్నాము.. రోజుకో వార్త నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.కొన్ని వింతలు వింటే ఆశ్చర్యం కలిగే.. కొన్ని సార్లు షాక్ కు గురి చేస్తాయి. పంది కడుపున వింత జీవి పుట్టడం.. ఆవు పంది పిల్లకు పాలు ఇవ్వడం,పిల్లి కుక్కల స్నేహం వంటి రక రకాల వింతలు సమాజంలో నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి.


అసలు ఎప్పుడూ జరగనివి.. ఊహించినవి కనిపించినప్పుడు అద్భుతం అనిపిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి వింతలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.. వీర బ్రహ్మంగారు కాలజ్ఞానం లో చెప్పినట్లు జరిగాయని కామెంట్ చేయడం చేస్తున్నారు.. ఇలాంటి అరుదైన ఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా అలాంటి వింత ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఆంధ్రప్రదేశ్ లో ఈ అరుదరైన ఘటన వెలుగు చూసింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో వింత ఘటన చోటుచేసుకుంది. గోకవరం మండలం మురళినగర్‌కు చెందిన ఓ రైతు ఇంట్లో వింత దూడ జన్మించింది. దేవిశెట్టి రత్నాజీ అనే రైతు ఇంట్లో ఓ గేదెకు 8 కాళ్లు కలిగిన దూడ జన్మించింది. ఈ వింత దూడను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. రెండు వెన్నుముకలు, 8 కాళ్లు, ఒకే తలతో జన్మించిన ఈ దూడను చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు.. ఇక ఆ దూడను చూసిన వైద్యులు జన్యులోపాల వల్లే ఇలా జరిగిందని తేల్చి చెప్పారు..ఏది ఏమైనా కూడా ఈ వింత దూడను చూడటానికి జనాలు ఎగబడ్డారు.. గతంలో రెండు తలల దూడను మనం చూసే ఉన్నాము.. ఇలాంటి వింతలు నిత్యం సోషల్‌మీడియాలో దర్శన మిస్తున్నాయి. మీరు ఆ వింత జీవిని చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news