మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు ప్రభుత్వ పథకాలు మొదలు ఐటీఆర్ ఫైలింగ్, బ్యాంకు వ్యవహారాలు ఇలా ఎన్నో వాటికి అవసరం అవుతుంది. భారత దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. కనుక ఎప్పటికప్పుడు ఆధార్ ని అప్డేట్ చెయ్యాలి.
లేదంటే అనవసరంగా పనులు ఆగిపోతాయి. UIDAI అధికారిక వెబ్సైట్ లో ఈజీగా అప్డేట్ చేసుకోవాలి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇటీవల వివాహం చేసుకుని, మీ ఆధార్లో మీ పేరును అప్డేట్ చేయాలనుకుంటే ఆన్లైన్ ద్వారా మార్చుకోవచ్చు. పైగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు.
ఇంట్లో కూర్చొని ఈ పని చేయవచ్చు. లేదా మీ పేరులో ఏదైనా తప్పు ఉంటే కూడా మార్చవచ్చు. UIDAI అధికారిక వెబ్సైట్లో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ , ఇ-మెయిల్ చిరునామా వంటి వివరాలను మార్చుకోవచ్చు. ఇక వివాహం చేసుకుని, మీ ఆధార్లో మీ పేరును అప్డేట్ చెయ్యాలంటే ఇలా చెయ్యండి.
ముందుగా, మీరు ఆధార్ అధికారిక వెబ్సైట్ కి వెళ్లాలి.
కొత్త ట్యాబ్ తెరుచుకుంటుంది. ఇప్పుడు ‘ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయండి.
మీరు ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ను నమోదు చేయాలి.
తరవాత OTP వస్తుంది.
తర్వాత My Aadhaar విభాగంలో ‘అప్డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా ఆన్లైన్’కి వెళ్లండి.
అప్డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా పై క్లిక్ చేయండి.
మీరు మార్చాలనుకునే దానిని సెలెక్ట్ చేసుకోండి.
దీనితో పాటు, మీరు పత్రాలను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అప్లోడ్ చేసాక సరైన వివరాలను నమోదు చేసిన తర్వాత మీరు పే చెయ్యాలి.
చెల్లింపు పూర్తయిన తర్వాత, అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ జనరేట్ చేయబడుతుంది.
ఇలా ఆన్ లైన్ లో చేసుకోచ్చు లేదంటే దగ్గరలోని ఆధార్ సెంటర్ కి వెళ్లి ఆఫ్ లైన్ లో కూడా చేసుకోచ్చు.