చాలా మంది సమ్మర్ లో ఏదైనా టూర్ వెళ్లాలని ప్లాన్ చేస్తూ వుంటారు. మీరు కూడా ఎక్కడికి అయినా వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ప్రదేశాలే బెస్ట్. ఇండియాలో బీచ్, పర్వత ప్రాంతాలు, సాంస్కృతిక కేంద్రాలు వంటివి చాలానే వున్నాయి. దేశంలోని ప్రతి గమ్యస్థానానికి దాని సొంత సంస్కృతి, చరిత్ర ఉంటుంది. ఇక ఏయే ప్రదేశాలకి టూర్ వేస్తె బాగుంటుంది అనేది చూద్దాం.
లడఖ్:
లడఖ్ లోని చాలా చూడదగ్గ ప్రదేశాలు వున్నాయి. సమ్మర్ లో ఏమైనా మంచి ప్లేసెస్ కి వెళ్లాలని అనుకుంటే లడఖ్ కి ప్లాన్ చేసుకోండి. సమ్మర్ లో ఇది పర్ఫెక్ట్ ఉంటుంది.
కేరళ:
అలానే కేరళ కూడా చాలా బాగుంటుంది. కేరళ లోని ప్రశాంతమైన బ్యాక్ వాటర్‌ల వరకు ప్రత్యేక అనుభూతులను సొంతం చేసుకోవచ్చు. బోట్ హౌస్ వంటి వాటిని కూడా ఎంజాయ్ చెయ్యచ్చు. అల్లెపీ, మున్నార్ ఇలా చాలా చూడదగ్గ ప్రదేశాలు వున్నాయి.
డార్జిలింగ్:
డార్జిలింగ్ లోని టీ తోటల అందాలు కూడా చూడచ్చు. సమ్మర్ లో ఎక్కడకి అయినా వెళ్లాలని అనుకుంటే డార్జిలింగ్ కూడా వెళ్లి వచ్చేయచ్చు. ట్రెక్కింగ్, టీ టూర్‌లు, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, టైగర్ హిల్ సన్‌రైజ్ వ్యూ ఇవన్నీ కూడా చూడచ్చు. ఆస్వాదించవచ్చు. పైగా సమ్మర్ లో హిల్ స్టేషన్స్ కి వెళ్తే చాలా బాగుంటుంది. అందులోనూ పిల్లలకి సెలవలు కనుక చక్కగా ఫ్యామిలీ తో వెళ్లి ఎంజాయ్ చెయ్యచ్చు.