బ్యాంక్ జాబ్స్ కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ముందుగా గుర్తుంచుకొవాల్సింది టైమ్..ఒక్కో ప్రశ్నకు 33.7 సెకండ్లు మాత్రమే మనకు సమయం ఉంటుంది. ఒక్కో ప్రశ్న చకచక చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఒక ప్రశ్న రాకుంటే ఆ ప్రశ్నను స్కిప్ చేసి వేరొక ప్రశ్నలోకి వెళ్ళాలి. 33 సెకన్లలోపే మనం ప్రశ్నకు సమాధానం రాసేలా ఉండాలి. మిగిలిన 0.7 సెకను సమాధానం క్లిక్ చేయడానికే సరిపోతుంది. ముఖ్యంగా కష్టంగా ఉన్న టాపిక్స్ ఏవీ, మనకు రాని టాపిక్స్ ఏమి ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి. మనకు తెలియని ప్రశ్నలను పలుమార్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం బేసిక్స్ నేర్చుకున్న తరువాత ప్రతి టాపిక్ పైన ప్రాక్టీస్ చేయడం మేలు..
ఇలా కొన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు టైం తో పాటు,చిన్న చిన్న పొరపాట్లు కూడా అర్థం అవుతాయి..వెనుకబడ్డ టాపిక్స్ ను బాగా చదువుకొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అర్థమెటిక్ లో టైం అండ్ వర్క్., నంబర్ సిస్టం, ఎల్సీఎం అండ్ HCF. LCM మరియు HCF, నంబర్ సిస్టం కీలకంగా ఉంటాయి. ముల్టీఫికేషన్ ముఖ్యంగా కీ రోల్ పోషిస్తుంది. రేషియో అండ్ ప్రపోషన్స్, పర్సెంటేజస్, ప్రాఫిట్ అండ్ లాస్ ఈ చాఫ్టర్లలలో ఏది కష్టంగా ఉంటె వాటిని పదే పదే చదువుకొని టెస్ట్ కు రాయాలి.అలా చేయడం వల్ల మీకే పూర్తిగా అవగాహన అవుతుంది.
రేషియెస్ అండ్ ప్రపోజిషన్స్, పర్సెంటేజెస్, టైం అండ్ వర్క్, ట్రైన్స్ ప్రాబ్లమ్స్,పైప్స్ అండ్ సీక్వెన్స్ ను పూర్తి స్థాయిలో నేర్చుకోవడం ద్వారా డేటా ఇంటర్ప్రిటేషన్ సులువుగా వచ్చేసినట్లే. అధికసంఖ్యలో టెస్ట్ లు రాయడం ద్వారా టైం అండ్ అక్యురసీ వస్తుంది. తద్వారా మనం ఎక్కడ వెనుకబడి ఉన్నామో మనకు అర్థం అవుతుంది. ఎక్కువ పరీక్షలు రాస్తే వాటితో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముందు పరీక్ష అంటే భయం పోతుంది. తక్కువ సమయంలో ప్రశ్నకు సమాధానం ఎలా రాయాలో తెలుస్తుంది..
ఇకపోతే క్యాలుకులేషన్స్ వేగంగా చేయడం పర్సెంటెజ్ అప్లికేషన్, ఆల్జీబ్రాలోని ఫార్ములాస్ మనకు అవగాహన ఉండాలి. పర్సెంటెజ్ అనే కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటే సింప్లిఫికేషన్స్, పర్సెంటెజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇన్ట్రస్ట్, కాంపౌండ్ ఇన్ట్రస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలసిస్ వంటి వాటిలో పర్సంటేజ్ ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది. ఒక్క పర్సెంటెజ్ కాసెప్ట్ స్కోరింగ్ కు మంచి అవకాశం ఇస్తుంది. ఆల్జీబ్రా లో చిన్న చిన్న ఫార్ములాస్ బాగా కంఠాపాఠం చేయాలి. రేషియో కాన్సెప్ట్స్ ఉంటాయి. రేషియో ప్రపోషన్, పార్ట్నర్ షిప్ బాగా నేర్చుకోవాలి..
రేషియో ఒక్క టాపిక్ నేర్చుకోవడం ద్వారా…అందులో మిగిలిన మరో మూడు టాపిక్స్ ను సులభంగా చేయవచ్చు. ఇక టైం సిరీస్ లో మరో మూడు టాపిక్స్ ఉంటాయి. టైం.,ఎఫీషియన్స్, వర్క్ అనేవి టైం సిరీస్ లో భాగం. ఈ మూడు టాపిక్స్ నేమ్స్ మార్చుకుంటూ ప్రశ్నల రూపంలో మన ముందుకు వస్తాయి. పైన చెప్పిన మూడు కాన్సెప్ట్స్ ను మూడు బ్లాకులుగా చేసి నేర్చుకుంటే మంచిది.మోడల్ పేపర్స్ ను తిరగెస్తే మార్కులు రావు..ఇది గుర్తుంచుకోండి… ఆల్ ది బెస్ట్..