ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా కంఫర్ట్ గా ఉండడానికి చూస్తున్నారు. అందుకని ఇంట్లో అన్ని రకాల సదుపాయాలని సమకూర్చుకుంటున్నారు. ముఖ్యంగా చలికాలం కాబట్టి వేడి నీళ్ల తో ప్రతి ఒక్కరు స్నానం చేస్తుంటారు. వేడి నీళ్ల కోసం శ్రమ పడకుండా గీజర్ ని కొనుగోలు చేస్తున్నారు.
చాలా మంది ఇళ్లల్లో ఈ మధ్య గీజర్ సాధారణంగా కనబడుతూనే ఉంది. గీజర్ లో చాలా రకాలు ఉన్నాయి తక్కువ ధర నుండి ఎక్కువ ధర వరకు మనకి అందుబాటులో ఉన్నాయి అయితే గీజర్ ని ఉపయోగించే వాళ్ళు కచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోండి. గీజర్ వలన ఎంత కంఫర్ట్ గా ఉంటుందో అంతే ప్రమాదం కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. గీజర్ వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం జరిగి అవకాశం ఉంది.
చాలా మంది ఎక్కువగా చేసే పొరపాటు ఏంటంటే గీజర్ ఆన్ చేసి తర్వాత ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటారు ఎక్కువ సేపు గీజర్ కనుక ఆన్ లో ఉంటే అది పేలి పోయే అవకాశం ఉంది కాబట్టి గీజర్ వేసిన తర్వాత గుర్తు పెట్టుకుని వెంటనే ఆఫ్ చేయండి. పాత మోడల్ గీజర్ మీ ఇంట్లో ఉంటే కచ్చితంగా అలారం పెట్టుకుని మరీ ఆఫ్ చేయండి.
లేకపోతే మరీ ప్రమాదం ఉంది. ఏవైనా చిన్న చిన్న రిపేర్లు వస్తే టెక్నీషియన్ ని పిలవండి అంతేకానీ మీరు మీకున్న నాలెడ్జ్ తో దానిని రిపేర్ చేయొద్దు. గీజర్ లో ఉంటే వాయువులు కార్బన్ డయాక్సయిడ్ ను ఉత్పత్తి చేస్తాయి. కనుక మీరు గీజర్ ని ఉపయోగించేటప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని వేయడం మర్చిపోవద్దు.