పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే వీటి గురించి తప్పక తెలుసుకోవాలి.. లేకుంటే భారీ నష్టమే..

-

ఉద్యోగులు తమ జీతం నుంచి ప్రతి నెల కొంత డబ్బులు అనేవి పీఎఫ్ అకౌంట్ లో జమ చేస్తుంటారు.. రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్య అవసరాలకు ఉపయోగ పడుతుంది..EPFO ఈ రిటైర్మెంట్ ఫండ్స్‌ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఈపీఎఫ్ సభ్యులకు ఈపీఎఫ్ ప్లాన్ 1952, ఎంప్లాయీస్ పెన్షన్ సిస్టమ్ 1995, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది ఈపీఎఫ్ఓ. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్స్యూరెన్స్ లాంటి సేవల్ని అందిస్తుంది. అయితే ఈపీఎఫ్ఓ నుంచి రావాల్సిన డబ్బులు క్లెయిమ్ చేయడానికి పలురకాల ఫామ్స్ ఉంటాయి. వాటిలో ప్రధానమైన 7 ఫామ్స్ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

*. ఈపీఎస్ స్కీమ్‌లో యజమాని జమ చేసిన వాటా నుంచి డబ్బులు డ్రా చేయడానికి ఫామ్ 10సీ సబ్మిట్ చేయాలి..

*.రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ పొందడానికి ఫామ్ 10డీ సబ్మిట్ చేయాలి..

*. పీఎఫ్ అకౌంట్‌కు సంబంధించి ఫైనల్ సెటిల్మెంట్ కోసం ఫామ్ 19 సబ్మిట్ చేయాలి..

*. ఈపీఎఫ్ అకౌంట్‌లో ఉన్న డబ్బుల్ని డ్రా చేయడానికి, అంటే పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఫామ్ 31 సబ్మిట్ చేయాలి..

*. మీరు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీలోకి మారినప్పుడు, పాత కంపెనీలో జమ చేసిన ఈపీఎఫ్ డబ్బుల్ని, కొత్త కంపెనీలోని ఈపీఎఫ్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఫామ్ 13 సబ్మిట్ చేయాలి. ఇలా వేర్వేరు కంపెనీల డబ్బుల్ని ఒకే అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తే మీరు జమ చేసిన మొత్తం ఒకేచోట కనిపిస్తుంది..

*. ప్రమాదాల ద్వారా మరణిస్తే వారి కుటుంబ సభ్యులు లేదా నామినీ పీఎఫ్ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఫామ్ 20 సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు ఉద్యోగం చేసిన గడువు 10 ఏళ్ల లోపు ఉన్నా ఈ ఫామ్ ఉపయోగపడుతుంది..

*. అదే విధంగా ఒక ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులు లేదా నామినీ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ ప్రయోజనాలను పొందడానికి 51 ఫాం ను పొందుపరచాలి..

*. పైన ఫామ్స్‌లో ఉద్యోగులు ఎక్కువగా ఫామ్ 10సీ, ఫామ్ 31, ఫామ్ 19 ఉపయోగిస్తారు. అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి ఉపయోగపడే ఫామ్స్ ఇవి. మరి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో వివరంగా తెలుసుకోండి…

ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి..

Step 1- ఈపీఎఫ్ఓ సేవా పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి.

Step 2- యూనివర్సల్ అకౌంట్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

Step 3- ఆన్‌లైన్ సర్వీసెస్‌లో Claim (Form-31, 19 & 10C) లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 4- బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి పూర్తిగా చేయాలి.

Step 5- నియమనిబంధనలు అంగీరకించి Proceed for Online Claim పైన క్లిక్ చేయాలి.

Step 6- ఆ తర్వాత I Want to Apply For పైన క్లిక్ చేయాలి.

Step 7- రిటైర్మెంట్‌కు ముందు డబ్బులు విత్‌డ్రా చేస్తారు కాబట్టి PF Advance (Form 31) ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 8- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి క్లెయిమ్ సబ్మిట్ చేయాలి..

పైన చెప్పిన స్టెప్స్ ప్రకారం పిఎఫ్ డబ్బుల కోసం ప్రాసెస్ చేసిన 15 నుంచి 20 రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్‌లో పీఎఫ్ డబ్బులు యాడ్ అవుతాయి…

Read more RELATED
Recommended to you

Latest news