బన్నీ పుష్ప 2లో మరో బాలీవుడ్ హీరో ?

-

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా పుష్ప . నిజానికి బాలీవుడ్లో ప్రమోషన్స్ చేయకుండానే సినిమా విడుదల చేసి రూ. 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ ఫేమ్ దేశవ్యాప్తంగా పాకిపోయిందని చెప్పవచ్చు.


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా చేయకపోయినా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాను చాలా గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు సుకుమార్. అయితే.. పుష్ప 2 సినిమాలో ఓ బాలీవుడ్ హీరో కూడా నటించనున్నాడట.

లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కీ రోల్ చేయనున్నారని తెలుస్తోంది. అర్జున్ కపూర్ కూడా పోలీస్ పాత్రలో కనిపించనున్నారని టాక్. అయితే దీనిపై పుష్ప యూనిట్ నుండి మాత్రం అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news