లోయలో పడ్డ ఆర్మీ బస్సు.. 16 మంది జవాన్లు మృతి

-

శుక్రవారం చైనా సరిహద్దుకు సమీపంలోని ఉత్తర సిక్కిం లోని ఒక మారుమూల ప్రదేశంలో ఘోర ప్రమాదం జరిగింది. మంగం జిల్లా లాడ్జింగ్ లో ఆర్మీ జవాన్ల ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీ వాహనం 20 మంది ప్రయాణికులతో సరిహద్దు పోస్టుల వైపు వెళుతుంది. జిమా 3 ప్రాంతంలో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news