BREAKING : దిల్లీ లిక్కర్ స్కామ్​లో కీలక మలుపు

-

సంచలనం రేపుతున్న దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తాను కవితకు బినామీ అంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌కు ఇచ్చిన వాంగ్మూలాన్ని అరుణ్‌ రామచంద్ర పిళ్లై వెనక్కి తీసుకున్నారు. వాంగ్మూలం ఉపసంహరించుకుంటానంటూ దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మద్యం స్కామ్‌లో తన పాత్రపై వాంగ్మూలం ఇచ్చిన అరుణ్‌ పిళ్లై… తాను కవితకు బినామీనని అంటూ తెలిపారు. ఈనెల 13 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్న అరుణ్ పిళ్ళై పిటిషన్‌పై… సీబీఐ ప్రత్యేకకోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది.

మరోవైపు ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని సూచించింది. అయితే తాను ఇతర కార్యక్రమాల్లో బిజీ ఉన్నందున విచారణకు హాజరుకాలేనని. కాస్త సమయం ఇవ్వాలని కవిత ఈడీని కోరింది. దీంతో రేపు ఈడీ ఎదుటకు కవిత హాజరుకానున్నారు. మరోవైపు తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ఈడీని కోరానని.. కానీ దానికి ఈడీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని కవిత వాపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news