హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని కావాలి : అసదుద్దీన్ ఒవైసీ

-

రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా నియమితులవ్వడం పట్ల ప్రపంచమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. వందల ఏళ్లు మనల్ని పాలించిన బ్రిటన్ ను ఇప్పుడు ఏలేది మనోడే అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు భారతీయులు. రిషి సునాక్ విజయం పట్ల ప్రముఖ రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. రిషికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజాగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. అయితే ఒవైసీ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? “హిజాబ్ ధరించిన మహిళ భారత్‌కు ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు ఒవైసీ.

“ప్రజాస్వామ్య బద్ధంగా ఆ దేశంలో ప్రధానిని మార్చేశారు. అది వాళ్ల నిర్ణయం. కానీ.. హిజాబ్‌ ధరించడంపై మన దగ్గర నిషేధం అమలవుతోంది. నేనొకటే చెబుతున్నాను. నేను బతికున్నప్పుడో లేదంటే నా తరవాతైనా సరే హిజాబ్ ధరించిన మహిళ దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నాను” అని వెల్లడించారు. యూకేలో తొలిసారి ఓ నాన్ క్రిస్టియన్‌ ప్రధాని అవడంపై ఈ విధంగా స్పందించారు అసదుద్దీన్.

Read more RELATED
Recommended to you

Latest news