నిన్న దేశ వ్యాప్తంగా సూర్య గ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే.. దేశ ప్రజలకు మరో బిగ్ అలర్ట్. నవంబర్ 8న ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీకమాసం పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది. ఇది భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అయితే భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం 5:30 గంటలకు ప్రారంభమై 6:19 వరకు ఉంటుంది.
దాదాపు గంటన్నర పాటు కొనసాగనున్న ఈ గ్రహణం భారత్ తో పాటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర ఫసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో కనిపించనుంది. ఇదిలా ఉంటే, జ్యోతిష్యుల ప్రకారం 15 రోజుల్లో రెండు గ్రహణాలు సంభవించడం అశుభ ఫలితాలను తెస్తుంది. అంటే 15 రోజుల వ్యవధిలో వచ్చే రెండు గ్రహణాలు ప్రపంచంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.