Dil Raju: దిల్ రాజుతో యంగ్ హీరో గొడవ..పట్టించుకోకుండా ‘సెల్ఫిష్’ అయిపోయిన ఆశిష్

-

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రజెంట్ క్రేజీ అండ్ భారీ ప్రాజెక్టులను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RC15 ఫిల్మ్ దిల్ రాజు ప్రొడక్షన్ హౌజ్ 50వ చిత్రం అవుతుండటం విశేషం. ఈ సంగతులు పక్కనబెడితే..దిల్ రాజు కుటుంబం నుంచి హీరోగా వచ్చిన ఆశిష్ రెడ్డి ‘రౌడీ బాయ్స్’ సినిమాతో ఊహించినట్లుగానే చక్కటి విజయం సొంతం చేసుకున్నాడు.

తొలి సినిమా కాలేజీ బ్యాక్ డ్రాప్ అవడంతో పాటు సరైన ఫార్ములాతో పిక్చర్ సక్సెస్ అయింది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కథానాయికగా అనుపమా పరమేశ్వరన్ నటించింది. కాగా, ఆశిష్ రెడ్డి రెండో చిత్రానికి కూడా అప్పుడే ప్రకటన వచ్చేసింది. శుక్రవారం ఈ చిత్ర ఓపెనింగ్ ఉన్నట్లు ఆశిష్ రెడ్డి మాటల ద్వారా స్పష్టమవుతోంది.

ఈ పిక్చర్ ఓపెనింగ్ కు ఉండాలని కోరుతూ తన బాబాయ్ (చిచ్చా)తో ఆశిష్ గొడవ పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను దిల్ రాజు యూట్యూబ్ చానల్ వారు విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో తాను అమృత్ సర్ కు వెళ్తున్నానని, కుదరబోదని, ఇంకో తేదీ చూసుకోవాలని దిల్ రాజు ఆశిష్ కు చెప్తాడు. కానీ, ఆశిష్ మాత్రం కుదరదని పట్టు పడ్తాడు.

ఇంత సెల్ఫిష్ అయిపోయావేంటని దిల్ రాజు అడగగా, తాను ‘సెల్ఫిష్’ టైటిల్ ఫిక్స్ అయ్యానని, సినిమాలోనే ఉన్నాను కాబట్టి ఉండాలని కోరుతున్నాడు. అలా తన చిచ్చతో ఆశిష్ ఫన్నీగా రచ్చరచ్చ చేసిన వీడియో రిలీజ్ చేశారు. మొత్తంగా శుక్రవారం ఆశిష్ రెడ్డి రెండో సినిమా ఓపెనింగ్ కాబోతున్నదన్న విషయం స్పష్టమవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news