కేజీఎఫ్ 2 ఓ చెత్త సినిమా… ప్రముఖ క్రిటిక్ సంచలన వ్యాఖ్యలు

-

కేజీఎఫ్ 2 గురువారం దేశవ్యాప్తంగా విడుదలైంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. కేజీఎఫ్ చాప్టర్ వన్ ఎవరూ ఊహించన విధంగా భారీ సక్సెస్ అవ్వడంతో కేజీఎఫ్ చాప్టర్ 2పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే సినిమా ఉందని రివ్యూలు కూడా వస్తున్నాయి. యశ్ తో పాటు సంజయ్ దల్, రవీనా టాండన్ ముఖ్యపాత్రల్లో నటించారు. విడుదలకు ముందు కేజీఎఫ్ 2 ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది. 

ఇదిలా ఉంటే ప్రముఖ సినీ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) కేజీఎఫ్ 2కు రివ్యూ ఇచ్చాడు. కేజీఎఫ్ 2 చెత్త సినిమా అంటూ వ్యాఖ్యానించాడు. ఇటీవల ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా ఇలాంటి కామెంట్లే చేశాడు కేఆర్కే. ట్రిపుల్ ఆర్ ఓ చెత్త సినిమా అంటూ… రాజమౌళిని జైలులో వేయాలంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు కేజీఎఫ్2 కూడా ఇలాంటి విమర్శలే చేశాడు. సినిమా 30 నిమిషాల పాటు ఏం జరుగుతుందో తెలియలేదని… దిమాక్ కరాబ్ అయిందంటూ వ్యాఖ్యానించాడు. ట్రిపుల్ ఆర్ కన్నా కేజీఎప్ 2 పదింతలు చెత్త అంటూ విమర్శించాడు.

Read more RELATED
Recommended to you

Latest news