డ్యాన్స్ ఇర‌గ‌దీసిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు..వీడియో వైర‌ల్..!

మాజీ కేంద్ర‌మంత్రి సీనియ‌ర్ టీడీపీ నాయ‌కులు అశోక్ గ‌జ‌ప‌తి రాజు త‌న రిసార్ట్ లో చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ప్ర‌స్తుతం అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఎన‌ర్జిటిక్ గా చేసిన డ్యాన్స్ వీడియోకు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. అశోక్ గ‌జ‌ప‌తి రాజు వీడియోలో త‌న కుంటుంబ స‌భ్యులు మ‌రియు స్నేహితుల‌తో స‌ర‌దాగా స్టెప్పులు వేస్తున్నారు. ఇక వీడియోలో ఆశోక్ గ‌జ‌ప‌తి రాజు పింక్ టీ ష‌ర్ట్ వేసుకుని కుర్రాడిలా మెరిసిపోతున్నారు.

గాగుల్స్ పెట్టుకుని ఆయ‌న ఎంతో ఎన‌ర్జీతో స్టెప్పులు వేయ‌డంతో ఇప్పుడు అంతా ఆశ్య‌ర్య‌పోతున్నారు. అంతే కాకుండా అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఎప్పుడూ రాజ‌కీయ‌ల‌తో ఫుల్ బిజీగా ఉంటారు. కానీ ఎప్పుడూ ఆయ‌న ఇలా స్టెప్పులు వేయ‌లేదు. ఇక మొద‌టి సారిగా ఇలా అశోక్ గ‌జ‌ప‌తిరాజు ను చూసిన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఆయ‌న అభిమాని ఒక‌రు..అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఉన్న‌త విలువ‌లు క‌లిగిన వ్య‌క్తి అని..ఆయ‌న ఇలా స‌ర‌దాగా రిలాక్స్ అవ్వ‌డంలో త‌ప్పులేద‌ని కామెంట్ చేసాడు.