తెలంగాణకు 4,418 కోట్లు రైల్వేలో కేటాయింపులు జరిగాయి : అశ్విని వైష్ణవ్‌

-

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే..తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో రైల్వే విభాగంలో తెలంగాణకి భారీగా కేటాయింపులు జరిగాయన్నారు. అంతేకాకుండా.. 4,418 కోట్లు రైల్వేలో తెలంగాణకు కేటాయింపులు జరిగాయని, 2009-14 వరకు ఉమ్మడి రాష్ట్రంలో 886 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. చాలా చోట్ల అండర్ పాస్‌లు, రైల్వే బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుందని ఆయన వివరించారు. అంతేకాకుండా.. ‘తెలంగాణ లో ఎంఎంటీఎస్ కి 600 కోట్లు కేటాయించాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉంది. రైల్వే స్టేషన్ లో రోజు వారి సరుకులు కూడా ప్రయాణికులకు దొరికేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వందే మెట్రోలు కూడా రాబోతున్నాయి.

సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ రైలు ప్రారంభించాం..మంచి స్పందన వస్తుంది. 60-70కిమి ఉన్న రెండు పట్టణాల మధ్య వందే మెట్రో నడుస్తుంది. వందే భారత్ కు భిన్నంగా వందే మెట్రో ఉంటుంది. మొదట టెస్ట్ చేసిన తరువాత వందే మెట్రోను ప్రవేశ పెడతామ్. 2017 లో వందే భారత్ ను మోడీ సూచించారు.. చాలా సార్లు పరీక్షించిన తరువాత వందే భారత్ రైళ్ల తయారీ ప్రారంభం అయ్యింది. బడ్జెట్ లో ఏపీకి రైల్వే శాఖ కింద 8406 కోట్ల కేటాయింపులు జరిగాయి. డబ్లింగ్,ట్రిపులింగ్ చేయాల్సి ఉంది. రెండు రాష్ట్రాలకు కలిపి 12800 కోట్ల కేటాయింపులు జరిగాయి. రైల్వే ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరుతున్నా. హై స్పీడ్ రైళ్ల పై అధ్యాయం చేస్తున్నాం. కాజీపేటలో వాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు టెండర్లను పిలిచాం. త్వరలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తాం. కోచ్ ఫ్యాక్టరీలు దేశంలో చాలా ఉన్నాయి. విభజన చట్టంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఫిజబులిటి పరిశీలించాలని ఉంది. కేంద్రం చేయాల్సింది చేస్తుంది..రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. రానున్న రోజుల్లో మరిన్ని వందే భారత్ రైళ్లు రాబోతున్నాయి’ అని అశ్విని వైష్ణవ్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news