హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే ముందు అడగాల్సిన కొన్ని ప్రశ్నలు..

-

హెల్త్ ఇన్స్యూరెన్స్ ( Health Insurance ) తీసుకునే ముందు అది ఎందుకు తీసుకుంటున్నారు? దానివల్ల ప్రయోజనం ఎలా ఉంటుంది అన్న విషయాలతో పాటు మరింత సమాచారం తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే వారు హాస్పిటల్స్ లిస్టు సహా ఇతర విషయాలు తెలుసుకోవాలి. ప్రస్తుతం హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలేమిటో ఇక్కడ చూద్దాం.

health insurance | హెల్త్ ఇన్స్యూరెన్స్
health insurance | హెల్త్ ఇన్స్యూరెన్స్

 

ప్లాన్ రకం

ముందుగా హెల్త్ ఇన్స్యూరెన్స్ లో మూడు రకాలు ఉంటాయి. ఫిక్స్డ్ బెనిఫిట్, మెడికల్ ఇంకా క్రిటికల్ ఇల్ నెస్.. ఈ మూడింటిలో వివిధ రకాల లాభాలు ఉంటాయి. అందులో మీరేది తీసుకుంటున్నారు. దానివల్ల ఏం వస్తుంది అన్నది మీకు తెలియాలి.

పాలసీ కవర్

మీరు తీసుకునే పాలసీ ద్వారా ఏమేమీ కవర్ అవుతాయి. హాస్పిటర్ ఛార్జీలు, ఆ తర్వాత అయ్యే ఛార్జీలు, అంబులెన్స్ ఛార్జీలు, యఆబ్ ఛార్జీలు, ప్రిస్కిప్షన్ ఛార్జీలు మొదలైనవన్నీ కవర్ అవుతాయా? లేదా అన్నది తెలుసుకోవాలి.

కవర్ కాని వ్యాధులు ఏంటి?

కొన్ని కొన్ని పాలసీల్లో కొన్ని కొన్ని వ్యాధులు కవర్ కావు. అలాగే కొన్నిసార్లు కొన్ని వ్యాధులు కవర్ కావాలి అంటే కొంతకాలం (వెయిటింగ్ పీరియడ్) ఉంటుంది. అది ఎంతకాలం ఉంటుంది? ఏయే వ్యాధులకి అది వర్తిస్తుంది అన్న అంశాలు అడగండి.

రొటీన్ చెకప్

మీరు తీసుకునే హెల్త్ ఇన్స్యూరెన్స్ ద్వారా రొటీన్ చెకప్ చేయించుకోవచ్చా? రొటీన్ చెకప్ లకి హెల్త్ ఇన్స్యూరెన్స్ వర్తిస్తుందా?

ఛార్జ్

మీరు తీసుకునే ప్లాన్ కి ప్రీమియం అమౌంట్ ఎలా చెల్లించాలి? నెల నెలా చెల్లిస్తే ఎంత ఉంటుంది? సంవత్సరానికి లేదా 6నెలలకి ఒకసారి చెల్లిస్తే ఎలా ఉంటుంది? అన్నది తెలియాలి. ఎందుకంటే కొన్ని కంపెనీలు ఈ ఛార్జీలను వేరు వేరుగా ఉంచుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news