భారతదేశంలో గత కొన్ని రోజుల నుండి పెగాసస్ అంశం ఎంత దుమారం రేపుతుందీ చెప్పాల్సిన పనిలేదు. భారత రాజకీయ నాయకులపైన, జర్నలిస్టులపై ఇంకా ఇతర అధికారుల పై పెగాసస్ ద్వారా నిఘా పెట్టారంటూ వచ్చిన వార్తలపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 300మందిపై నిఘాపెట్టారంటూ తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టాలని 9పిటీషన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈరోజున సుప్రీం కోర్టులో వాదనలు నడిచాయి. పిటీషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
పెగాసస్ అంశం భారతదేశానికే పరిమితం కాలేదని, ఫోన్ హ్యాకింగ్ అంశం కేంద్రానికి తెలియకుండా ఉండదని, వ్యక్తుల స్వేఛ్ఛా, స్వతంత్రాన్ని హరించే విధంగా, రాజ్యాంగ ద్వారా కల్పించబడ్డ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా పెగాసెస్ ఉందని, వివరించారు. ఐతే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పెగాసస్ అంశంపై విచారణను ఈ నెల 10తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే దేశ ప్రజలపై ఎలాంటి నిఘా పెట్టలేదని కేంద్రం చెప్పుకొచ్చింది.