రాహుల్ పై అసోం సీఎం విమర్శలు

గువాహటిలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆయన గుజరాత్ లో ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తన వెంట బ్యాట్, ప్యాడ్ ను కూడా సిద్ధంగా పెట్టుకుంటారు. కానీ, మైదానానికి రారు’’ అంటూ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్త పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు చేశారు. దీన్ని నేను ఎన్నో రోజులుగా గమనించాను. మరో రెండు వారాల్లో గుజరాత్ లో ఎన్నికలు జరగనున్నాయి. అయినా రాహుల్ గాంధీ ఇంత వరకు గుజరాత్ ఎన్నికల ప్రచారంలోకి రాలేదు. దీంతో బిశ్వ శర్మ పరోక్ష విమర్శలు చేశారు.

Positive development' regarding AFSPA in 2022: Assam CM Himanta Biswa Sarma  | Deccan Herald

రెండు, మూడో స్థానం కోసమే ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది’’ అని వ్యాఖ్యానించారు. వీర్ సావర్కార్ విషయంలో రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. చారిత్రక విషయ పరిజ్ఞానం తక్కువన్నారు. గుజరాత్ లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని బిశ్వ శర్మ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ రెండు, మూడో స్థానాల్లో నిలుస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ‘‘బీజేపీ ఉన్న స్థానంలోనే ఉంటుంది. బీజేపీకి పోటీ లేదన్నారు బిశ్వ శర్మ.