దేశ చరిత్రలో తొలిసారి.. రాష్ట్రపతి ఎట్ హోం రద్దు.

-

కరోనా వల్ల దేశంలో నిర్వహించే సంప్రదాయాలు మాయం అవుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతీ ఏడాది రాష్ట్రపతి నివాసంలో ఎట్ హోం నిర్వహిస్తారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, పలు రంగాల ప్రముఖులకు రాష్ట్రపతి తేనీటి విందు ఇవ్వడం అనవాయితీ. అయితే కరోనా కారణంగా ఈసారి ఎట్ హోమ్ రద్దు అయింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎట్ హోంను రద్దు చేశారు. కరోనా, ఓమిక్రాన్ తీవ్రత అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా కారణంగా గత ఏడాది పరిమిత సంఖ్యలో ఎట్ హోం నిర్వహించారు. తాజాగా ఈ ఏడాది దాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఇదిలా ఉంటే వరసగా రెండో ఏడాది కూడా గణతంత్ర దినోత్సవానికి విదేశీ అతిథులు రాలేదు. దీనికి కూడా కరోనా కారణమే. గతేడాది గణతంత్ర దినోత్సవానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ సమయంలో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో ఆయన హాజరుకాలేదు. తాజాగా ఈసారి కూడా ఓమిక్రాన్ భయాల వల్ల విదేశీ అతిథులు రాలేదు. దేశ చరిత్రలో ఇలా విదేశీ అతిథులు రాకుండా రిపబ్లిక్ వేడుకలను నిర్వహించడం ఇది ఐదో సారి.

Read more RELATED
Recommended to you

Latest news