జల జగడం.. నీటి పారుదలశాఖపై కేసీఆర్‌ సమీక్ష

-

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతూనే ఉంది. మీదంటే.. మీది తప్పు అని ఇరు రాష్ట్రాలు మాటల తుటాలు పేల్చుతున్నాయి. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వమైతే ఓ అడుగు ముందుకు వేసి.. కేంద్రానికి వరుసగా లేఖలు రాస్తోంది. ఇటు తెలంగాణ మంత్రులేమో.. వైఎస్సార్‌, సీఎం జగన్‌ లను తీవ్రంగా స్థాయిలో తిడుతున్నారు.

cm-kcr
cm-kcr

అయితే… ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఇవాళ సమావేశం అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారు.

జల వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 9 న జరగబోయే కేఆర్‌ఎంబీ సమావేశం వాయిదా వేయాలని తెలంగాణ సర్కారు ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశానికి ప్రధాన్యత సంతరించుకుంది. ఇక ఈ సమావేశంలో సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజత్‌ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news