ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. రాబోయే ఏడాది జనవరి నుంచి ఏటీఎం అపరిమిత లావాదేవీలపై రుసుములు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రతి నెలా ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని మించితే.. ఎక్కువ రుసుములు వసులు చేయనున్నట్లు తెలిపింది. 2022 జనవరి 1 నుంచి ఇది అమలు అవుతుందని పేర్కొంది.
ఏటీఎం అపరిమిత లావా దేవీలపై కస్టమర్ల నుంచి ఫైన్ వసూలు చేసేందుకు దేశంలోని అనేక బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఆర్బీఐ ప్రకటన తర్వాత.. ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ తమ కస్టమర్లను ఉద్దేశించి దీనిపై ప్రకటన కూడా చేసింది. “ఆర్బిఐ మార్గ దర్శకాలకు అనుగుణంగా.. 2022 జనవరి ఒకటో తేదీ నుంచి ఆక్సిస్ బ్యాంకు లేదా ఇతర బ్యాంకు ఏటీఎంల లో ఉచిత పరిమితి లావాదేవీల కంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలు చేస్తే 20 రూపాయలు వసూలు చేయ బడుతుంది” అంటూ యాక్సిస్ బ్యాంకు ప్రకటన చేసింది.