తెలంగాణలో మరో ఏటీఎం చోరీ.. జస్ట్ లో మిస్సయిన మరో ఏటీఎం !

Join Our Community
follow manalokam on social media

తెలంగాణలో ఏటీఎం దొంగలు రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ శివార్లలో దొంగతనం చేయగా ఇప్పుడు నల్గొండ జిల్లాలో కూడా అర్ధ రాత్రి సమయాన దొంగలు రెచ్చిపోయారు.చిట్యాలలోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు చోరీకి యత్నించారు. అయితే ఏటీఎం లాకర్ ఓపెన్ కాకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అక్కడి నుండి వెళ్లి వెలిమినేడు వద్ద గల “ఇండి క్యాష్ ” ఏటీఎంలో చోరీకి యత్నించారు.

అయితే అక్కడ లాకర్ ఓపెన్ కావడంతో అందులోని నగదును ఎత్తుకెళ్లారు. వట్టి మర్ధి వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారును ఎత్తుకెళుతూ అందులో డీజిల్ అయిపోవడంతో కారును మధ్యలోనే వదిలేసి వెళ్లారు. ఆ తరువాత మరో క్వాలిస్ వాహనం దొంగలించి పంతంగి టోల్ గేట్ వద్ద వదిలి అక్కడి నుంచి పారిపోయారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.చోరీకి పాల్పడింది అంతర్ రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు.  

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...