సంగీత ద‌ర్శ‌కుడిపై దాడి!

-

టాలీవుడ్ వ‌ర్ధ‌మాన సంగీత ద‌ర్శ‌కుడిపై దాడి జ‌రిగింది. చిన్న సినిమాల‌కు సంగీతం అందిస్తూ ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా పేరు లేని యువ సంగీత ద‌ర్శ‌కుడు అగ‌స్త్య బోయ‌ల‌ప‌ల్లిపై ముగ్గురు దాడికి తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో చోటు చేసుకుంది. ఆర్థిక లావాదేవీల్లో మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్త‌డంతో ఆగ‌స్త్య‌పై ఇద్ద‌రు అమ్మాయిలు ఓ యువ‌కుడు ముగ్గురు మూకుమ్మ‌డిగా దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు.

హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లో నివాసం వుంటున్న ఆగ‌స్త్య ఇంటిపై చిట్టి నాగార్జున‌రెడ్డి, చిట్టి అనుషారెడ్డి, చిట్టి శ్రావ్యారెడ్డి క‌లిసి దాడి చేశారు. ఈ దాడిలో రెండు సెల్‌ఫోన్‌ల‌ని ప‌గుల గొట్టారు. అగ‌స్త్య‌పై బ‌డి తీవ్రంగా చిత‌క బాదారు. ఈ పెనుగులాట నుంచి త‌ప్పించుకున్న అగ‌స్త్య ఆసుపత్రిలో చేరాడు. ఈ గొడ‌వ‌లో అగ‌స్త్య కుడిచేయి విరిగింది. హాస్పిట‌ల్ నుంచి తిరిగి వ‌చ్చిన ఆగ‌స్త్య జూబ్లీ హిల్స్ పోలీసుల్ని సంప్ర‌దించాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీస్‌లు విచార‌ణ మొద‌లుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news