చంద్రబాబు తన 40ఏళ్లకు పైబడిన రాజకీయ జీవితంలో ఒక గొప్ప సన్నివేశాన్ని చూడబోతున్నారంట! వెన్నుపోటులు పొడిచో, రంగులు మార్చో, అనైతికతను అర్ధంలా నిలిచో, మోసం చేసో, మాయ చేసో… కారణాంలు ఏమైనా బాబు రాజకీయంగా నిత్యం ఎదుగుతూనే ఉన్నారు! ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచినదగ్గరనుంచి ఇంక వెనక్కి తిరిగిచూసుకోలేదు! అయితే సీఎం లేకుండా ప్రతిపక్ష నాయకుడు! లేదా కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీతో దోస్తానా! అయితే ఇప్పుడు అంతకు మించిన హిస్టారికల్ సన్నివేశం ఒకటి బాబు రాజకీయ జీవితంలో జరగబోతుందని అంటున్నారు!
అవును… 2019ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి వచ్చినవి 23 సీట్లు! చినబాబు కూడా గెలుచుంటే 24 అయ్యేవి కానీ… మందలగిరి ప్రజలు చినబాబును నమ్మలేదు! ఉన్న 23లో వల్లభనేని వంశీ బోణీ చేయగా… అనంతరం మద్దలగిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ ల రూపంలో బేరాలు సీరియస్ గా సాగాయి. ఫలితంగా బాబు వ్యాపారం దివాలాకు దగ్గరకు చేరిపోయింది! ఇప్పుడు గంటా శ్రీనివాస్ వంతు! శనివారం ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు!
అదే జరిగిన అనంతరం బాబు ఫిగర్ 18! అంటే… ఇంకొక్క అడుగుదూరంలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా.. ఉంచాలా దించాలా అన్నట్లుగా ఉందన్న మాట!! వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఈ ఐదుగురికి శాసనసభలో ప్రత్యేక గుర్తింపు ఇచ్చే అవకాశముంది. వీరంతా అధికారికంగా వైకాపాలో చేరడం లేదు కాబట్టి.. వీరిపై అనర్హత వేతువేసే అధికారం కూడా బాబుకు ప్రస్తుతానికి ఉండకపోవచ్చు! ఫలితంగా బాబు కోసం వీరు చేతులు ఎత్తరు!!
అసెంబ్లీ సమావేశాల నాటికి ఇంకొక్క టీడీపీ ఎమ్మెల్యే సైకిల్ దిగిపోయే గనుక… బాబు పేరు పక్కన “ఏపీ ప్రతిపక్ష నేత” పోయి “కుప్పం ఎమ్మెల్యే” అని వచ్చి చేరుతుంది! తన పొలిటికల్ కెరీర్ లో ఇలాంటి వరస్ట్ సన్నివేశం చూడాల్సి వస్తుందని బాబు భావించి ఉండకపోవచ్చు! కాబట్టి… ఇలాంటి సన్నివేశం జరిగే చోటికి బాబు ఇంక రాకపోవచ్చు! ఫలితంగా ఏ ముహూర్తాన ఏపీని వదిలి బాబు భాగ్యనగరానికి వచ్చారో… ఇంక అక్కడే శాస్వతంగా రాజకీయంగా ఒక అభాగ్యుడిగా మిగిలిపోతారా? ప్రస్తుతం తమ్ముళ్ల టెన్షన్ ఈ రేంజ్ లో ఉంది!!
-CH Raja