మలయాళ కుట్టి పూర్ణ.. అసలు పేరు శామ్న కాషిం. కాగా, ‘ఢీ’ పూర్ణ గానే ఆమె బాగా పాపులర్. మలయాళ ఇండస్ట్రీలో కథానాయికగా పరిచయమైన ఈ సుందరి.. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి ఫేమస్ అయింది.
శ్రీమహాలక్ష్మి ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుసగా పలు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఈమె బుల్లితెరపైన సెటిల్ అయిపోయిందని చెప్పొచ్చు.
అయితే, వెండి తెరకు పూర్ణగా పరిచయమైన మలయాళ నటి షమ్న కాసిం కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఆమె పెళ్లి చేసుకున్నారు.
దుబాయ్ లో స్థిరపడిన వ్యాపారవేత్త జేబీఎస్ గ్రూప్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో శానిద్ ఆసిఫ్ ఆలీని షమ్న కాసిం పెళ్లాడారు. వీరి వివాహం ఇటీవల దుబాయ్ లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షమ్న కాసిం, ఆసిఫ్ అలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా నిర్వహించారు.