ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన అరినా సబలెంకా

-

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ మ‌హిళ‌ల సింగిల్స్ ఫైన‌ల్లో ఐదో సీడ్ అరినా స‌బ‌లెంక (బెలార‌స్) సంచ‌ల‌నం సృష్టించింది. మెల్బోర్న్ లో నేడు జరిగిన ఫైనల్లో సబలెంకా 4-6, 6-3, 6-4తో 22వ సీడ్ ఎలెనా రైబాకినాపై విజయం సాధించింది. తొలి సెట్ లో ఓటమిపాలైనప్పటికీ… ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు చేజిక్కించుకున్న సబలెంకా కెరీర్ లోనే చిరస్మరణీయ విజయం సాధించింది. తొలి సెట్ ను గెలిచినా, తర్వాత అదే ఊపు కనబర్చలేకపోయిన కజకిస్థాన్ అమ్మాయి 23 ఏళ్ల రైబాకినా రన్నరప్ తో సరిపెట్టుకుంది. కాగా, 24 ఏళ్ల సబలెంకాకు ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడంతో సబలెంకా ప్రపంచ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో రెండోస్థానానికి ఎగబాకింది.

ఇదిలా ఉంటే.. భారత అత్యుత్తమ మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జనవరి 27 శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ 2023లో భాగస్వామి రోహన్ బోపన్నతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్ లో ఓటమి చవిచూసింది. తన 18 ఏళ్ల గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ఈ ఓటమితో ముగించింది. టైటిల్ పోరులో మీర్జా-బోపన్న జోడీ 7-6 (2), 6-2తో బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ, రఫెల్ మాటోస్ చేతిలో వరుస సెట్లలో ఓడిపోయింది.

దుబాయ్‌లో జరిగిన డబ్ల్యూటీఏ టోర్నీ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సానియా, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతోంది. మాజీ డబుల్స్ ప్రపంచ నం. 1 మూడు మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, మూడు మహిళల డబుల్స్ టైటిల్స్‌తో అద్భుతమైన కెరీర్‌ ఉన్న సానియా ఓ ఓటమితో తన కెరీర్ ను ముగించింది.

Read more RELATED
Recommended to you

Latest news