టీ20 వరల్డ్‌ కప్‌.. శ్రీలంక చిత్తు చేసిన ఆసిస్‌..

-

టీ20 వరల్డ్‌ కప్‌లో జట్ల మధ్య హోరాహోరీగా సాగుతోంది. అయితే నేడు టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అస్ట్రేలియాతో శ్రీలంక
తలపడుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసిస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆస్టన్ అగర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఆసిస్‌ 16.3 ఓవర్లలోనే 158 పరుగులు చేసి విక్టరీ నమోదు చేసింది.

Australia vs Sri Lanka Highlights, T20 World Cup 2022: Sensational Marcus  Stoinis powers AUS to victory vs SL in Perth | Hindustan Times

శ్రీలంక ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా వచ్చిన పథుమ్ నిస్సంక (40) ఆ జట్టుకు శుభారంభాన్నే ఇచ్చాడు. నిస్సంకకు జోడిగా వచ్చిన కుశాల్ మెండిస్ (5) మాత్రం నిరాశ పరిచాడు. రెండో ఓవర్ లోనే లంక తొలి వికెట్ కోల్పోగా… మెండిస్ స్థానంలో వచ్చిన ధనంజయ డిసిల్వా (26), ఆ తర్వాత వచ్చిన ఛరిత్ అసలంక (38 నాటౌట్) ఒకింత జోరు చూపించినా… వరుసగా వికెట్లు పడటంతో లంక బ్యాటర్లు భారీ స్కోర్లు రాబట్టలేకపోయారు. వెరసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి లంక 157 పరుగులు మాత్రమే చేసింది.

158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (11), ఆరోన్ ఫించ్ (31) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వార్నర్ స్వల్ప స్కోరుకే అవుటైనా… మిచెల్ మార్షల్ (18), గ్లెన్ మ్యాక్స్ వెల్ (23) క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్ (59) పరుగులతో వీర విహారం చేశాడు. కేవలం 18 బంతులను మాత్రమే ఎదుర్కొన్న స్టోయినిస్ 6 సిక్స్ లు, 4 ఫోర్లు బాది లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. 327.77 స్ట్రయిక్ రేటుతో ఆడిన స్టోయినిస్ 16.9 ఓవర్లలోనే ఆసీస్ కు విజయాన్ని అందించాడు. అంతిమంగా 7 వికెట్ల తేడాతో లంకపై ఆసీస్ విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news