Breaking : రిషి సునాక్‌ ఎన్నికపై స్పందించిన ఆర్జీవీ

-

రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా బ్రిటన్ రాజు చార్లెస్ ను కలిసిన అనంతరం దేశ నూతన ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం బ్రిటన్ ప్రధానిగా పదవి చేపట్టిన రిషి సునాక్… బ్రిటన్ పౌరులకు భరోసా ఇస్తూ కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం విన్నంతనే భారతీయులు ఆయనను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

మనల్ని 200 ఏళ్లు పాలించిన వాళ్లను ఇప్పుడు మనం పాలిస్తున్నాం: రాంగోపాల్ వర్మ

ఇందులో భాగంగా సినీ దర్శకుడు ఆర్జీవీ కూడా రిషి సునాక్ ను అభినందింస్తూ ఓ ట్వీట్ ను పోస్ట్ చేశారు. 200 ఏళ్ల పాటు మనలను పాలించిన బ్రిటిషర్లను పాలించే అవకాశం ఎట్టకేలకు మనకు ఇప్పుడు దొరికింది అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు ఆర్జీవీ. ఈ దిశగా సత్తా చాటిన రిషి సునాక్ కు అభినందలు అంటూ వర్మ బ్రిటన్ కొత్త ప్రధానిని ఆకాశానికెత్తేశారు.

Read more RELATED
Recommended to you

Latest news