తొలి T20లో టీమ్ ఇండియాపై విజయం సాధించింది ఆస్ట్రేలియా. నాలుగు వికెట్ల తేడాతో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో భారత జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. జట్టు సమష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. కెమరూన్ గ్రీన్(61) టాప్ స్కోర్. స్మిత్ (35) పర్వాలేదనిపించగా.. చివర్లో మ్యాథ్యూ వేడ్(45) బాగా రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3, ఉమేశ్ యాదవ్ 2, చాహల్ ఓ వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ దిగిన భారత బ్యాటర్లు బాగానే ఆడారు. నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. దీంతో ఆసీస్‌కు 209 నిర్దేశించింది. హార్దిక్ పాండ్య(71*), కేఎల్ రాహుల్(55) అర్ధశతకాలు సాధించారు. సూర్యకుమార్ యాదవ్(46) రాణించాడు. ఆసీస్ బౌరల్లలో నాథన్ ఎల్లిస్ 3, హేజిల్‌వుడ్ 2, గ్రీన్ ఓ వికెట్ తీశారు.