కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అక్కడ మాజీ మంత్రి అఖిల ప్రియ అలాగే టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతుంది. కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ మాటలు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా అఖిల ప్రియపై పోటీకి సిద్దం అంటూ ఏవీ సుబ్బారెడ్డి తనయురాలు జస్వంతి కీలక ప్రకటన చేసారు.
తమది ఆళ్ళగడ్డ అని, అక్కడే రాజకీయం చేస్తామని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేసారు. తమను అక్కడికి స్వాగతించటానికి అఖిలప్రియ ఎవరు? అని ఆమె నిలదీశారు. అసలు అఖిలప్రియను అక్కా అని పిలవాలంటే అసహ్యం వేస్తోందన్న ఆమె… దేవుడిచ్చిన మామను దేవుడి దగ్గరకు పంపాలని అఖిలప్రియ కుట్ర చేసిందని ఈ సందర్భంగా ఆమె మండిపడ్డారు. తండ్రి లేని అఖిలప్రియకు తండ్రి విలువ తెలియదనుకుని…
ఆడపిల్లగా నాన్న లేని పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. కష్ట పడకుండా మంత్రి అయిన అఖిలప్రియకు కష్టం విలువ తెలియదని ఆమె వ్యాఖ్యానించారు. భూమా దంపతులు, ఏవీ సుబ్బారెడ్డి 30ఏళ్ళ కష్టం వలనే అఖిలప్రియకు ఆ స్థాయి దక్కిందన్న ఆమె… ఆమెది క్రిమినల్ మైండ్ అని అని ఆరోపించారు. అఖిలప్రియ తీరు మహిళలకే సిగ్గుచేటని మండిపడ్డారు. తన తండ్రి ప్రాణం ఖరీదు రూ.50లక్షలా? అడ్డు వచ్చిన వారందర్నీ అఖిలప్రియ చంపుతోందా? అంటూ నిలదీశారు.