Avatar The Way of Water : అవతార్ -2 ట్రైలర్ వచ్చేసింది..

-

13 ఏళ్ల క్రితం విడుదలైన అవతార్ ప్రపంచ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. ఆ సినిమా విజువల్స్ చూసి ఆశ్చర్యపోనివారుండరు. తన విజన్ తో టేకింగ్ తో జేమ్స్ కామెరూన్ అప్పుడే ప్రేక్షకులను ఓ సరికొత్త లోకంలోకి తీసుకెళ్లాడు. ఇప్పుడు మళ్లీ ఆ ఫ్రాంఛైజీలో అవతార్ -2 తీస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ వస్తుందా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి అవతార్ టీమ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. అవతార్- ద వే ఆఫ్ వాటర్ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎపిక్‌ సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ లో వస్తున్న ఈ చిత్రంలో కేట్‌ విన్స్‌లెట్‌ కూడా భాగమవ్వడం విశేషం.

లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రధాన భారతీయ భాషలన్నింటిలో విడుదల చేస్తున్నారు. డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది. 3డీ వెర్షన్‌లో సాగుతున్న ట్రైలర్‌ అవతార్‌ 2 మరో విజువల్ వండర్‌లా ఉండబోతుందని చెబుతోంది. ట్రైలర్ లో విజువల్స్ అదిరిపోయాయ్. జేమ్స్ కామెరూన్ మరోసారి తన విజన్ కి ఎవరూ సాటిరారని ప్రూవ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news