మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ పైన కేసు నమోద్.. కారణం..?

-

టాలీవుడ్ లో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్గా పేరుపొందారు దేవి శ్రీ ప్రసాద్. ఇక ఈయన పాటలకు ప్రేక్షకుల సైతం ఫిదా అవుతూ ఉంటారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా దేవిశ్రీప్రసాద్ పైన సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు నమోదైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా సినీ నటి కరాటే కళ్యాణి దేవి శ్రీ ప్రసాద్ పైన సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తున్నది. అయితే అందుకు గల కారణాలు ఎంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

దేవి శ్రీ ప్రసాద్ పైన పలు హిందూ సంఘాలు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అందుకు కారణం ఏమిటంటే దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఓ పారి అనే ఆల్బమ్ లో హరే రామ.. హరే కృష్ణ మంత్రాన్ని వాడారట. అయితే ఆ పాట ఐటెం సాంగ్ అని ఆ పాటలో హరే రామ.. హరే కృష్ణ మంత్రం ఎలా వాడుతారని దేవిశ్రీప్రసాద్ పైన కంప్లైంట్ చేయడం జరిగింది కరాటే కళ్యాణి, హిందూ సంఘాలు. ఇక ఫిర్యాదులో ఓ పారి అనే ఆల్బమ్ లో హరే రామ..హరే కృష్ణ అనే మంత్రాన్ని ఐటెం సాంగ్లో చిత్రీకరించారని ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. పవిత్రమైన హరే రామ హరే కృష్ణ మంత్రం పైన అశ్లీల దుస్తుల నృత్యాలతో పాటను చిత్రీకరించిన దేవిశ్రీప్రసాద్ పైన చర్యలు తీసుకోవాలని కరాటే కళ్యాణి తెలియజేసినట్లు తెలుస్తోంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవి శ్రీ ప్రసాద్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఆ వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని కూడా తొలగించాలని లేనిపక్షంలో దేవిశ్రీప్రసాద్ కార్యాలయాన్ని చుట్టూ ముడతామని కరాటే కళ్యాణి వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ విషయంపై దేవిశ్రీప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news