టిడిపి వాదనకు ఘాటైన కౌంటర్ల తో మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు.నలంద కిషోర్ మరణానికి చంద్రబాబే కారణమని, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత డబ్బుపై ఆశతో సొంత పార్టీ నేతలను అవినీతి ఉచ్చులో వదిలేశారని.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిపై ఘాటైన వ్యాఖ్యలతో మరోసారి రెచ్చిపోయారు.. నిన్న టిడిపి అధినేత, అతని కుమారుడు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ గా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ మరణానికి ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. నలంద కిషోర్ మృతిపట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వై ఎస్ ఆర్ సి పి వేధింపులతో మనస్థాపానికి గురై కిషోర్ మృతి చెందాడని విమర్శించారు.నలంద కిషోర్ మృతిపై నారా లోకేశ్ కూడా స్పందించారు. ఆయన మృతి చాలా బాధాకరమని సంతాపం ప్రకటించారు. పార్టీ ఓ క్రమశిక్షణ కలిగిన నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.