ఆ సమయంలో నన్ను నేనే ఆస‌హ్యించుకున్నను…అవికా గోర్..!

-

అందాల నటి అవికా గోర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అవికా గోర్ ‘బాలికా వ‌ధు’ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే సీరియల్ ను ‘చిన్నారి పెళ్ళికూతురు’ అనే పేరుతో తెలుగులో డబ్ చేసి ప్రసారం చేశారు. ఈ సీరియల్ తెలుగు నాట కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

అలా ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ కు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో ‘ఉయ్యాల జంపాల’ అనే సినిమాలో అవకాశం దక్కింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు అవికా గోర్ నటనకు, అందచందాలకు కు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కడంతో అవికా గోర్ కు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.

ఆ తర్వాత ఈమె ఫిల్మ్ కోర్సు చేయ‌డానికి ఆమె కొన్ని రోజులు సినిమాల‌కు కూడా దూర‌మైంది. ఇలా ఫిలిం కోర్స్ వల్ల సినిమాలకు కొంత కాలం పాటు దూరం అయిన అవికా గోర్ ‘రాజుగారి గది త్రీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

అయితే తాజాగా అవికా గోర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది… చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ గురించి అవికా గోర్ మాట్లాడుతూ… ఆ సీరియల్ చేసే సమయంలో నేను అంత హ్యాపీగా లేను అని, కొన్ని సందర్భాల్లో తనని తాను ఆస‌హ్యించుకున్నను అని అవికా గోర్ తెలియజేసింది. అది మాత్రమే కాకుండా స్క్రీన్‌పై చ‌క్క‌గా క‌నిపిస్తున్నానా… లేదా? అనే విష‌యాన్ని కూడా ప‌ట్టిచుకునే దాన్ని కాదని అవికా గోర్ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news