అయోధ్య రామయ్య భక్తులకు శుభవార్త : డిసెంబర్ నుంచే దర్శనాలు !

-

అయోధ్య గుడి నిర్మాణ పనులపై అయోధ్య శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొంది అయోధ్య శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫేస్ వన్ పనులు పూర్తికాగా ఫేస్ టు పనులు నవంబర్ చివరి నాటికి ముగుస్తాయని స్పష్టం చేసింది ట్రస్ట్.

అలాగే డిసెంబర్ 2023 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని… అదే సంవత్సరం ఆలయంలో శ్రీ రాముడి మూలవిరాట్టు ప్రతిష్టాపన చేయాలని భావిస్తున్నామని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. కాగా గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆలయ విశేషాలు వస్తే గుజరాత్లోని అహ్మదాబాద్ కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్ సొమ్ పూరా ఫ్యామిలీ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news