ఆరోగ్యకరమైన జీవనం కోసం ఆయుర్వేద చిట్కాలు..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవన విధానాన్ని అనుసరించాలి. అదే విధంగా ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం, ప్రశాంతంగా ఉండడం, ఒత్తిడి లేకుండా ఉండడం మొదలైనవి పాటిస్తూ ఉండాలి. అయితే ఆయుర్వేదం ప్రకారం ఈరోజు ఆయుర్వేద నిపుణులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. మరి ఆలస్యమెందుకు వాటికోసం ఇప్పుడే చూసేద్దాం.

ఆయుర్వేదం ప్రకారం మనం అనుసరించడం వల్ల శరీరం మరియు మెదడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అదే విధంగా మనం ఎంతో రిలాక్స్ గా ఉండచ్చు. ఆరోగ్యం కూడా పొందొచ్చు. అయితే ఆయుర్వేదం ప్రకారం అనుసరించాల్సిన పద్ధతులు చూసేద్దాం.

నిద్ర లేవడం:

సూర్యోదయం కంటే కూడా ఒక గంట ముందు లేవడం ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది.

నాజల్ డ్రాప్స్:

మంచి నిద్ర పొందాలంటే రెండు చుక్కలు నువ్వుల నూనె లేదా ఆవాల నూనె కాని నెయ్యి కాని వేసుకుంటే మంచి నిద్ర పొందొచ్చు. అదే విధంగా జుట్టు తెల్లబడకుండా బట్టతల రాకుండా కూడా చూసుకుంటుంది.

వ్యాయామం:

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం నిజంగా మంచి అలవాటు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల
ఫిట్ గా మాత్రమే కాకుండా ఎనర్జిటిక్ గా ఉండొచ్చు. అలానే బాడీ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది.

డెంటల్ కేర్:

ప్రతిరోజు మీరు పళ్ళు తోముకునేటప్పుడు వేప పుల్లని ఉపయోగిస్తే మంచిది ఇది దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

స్నానం:

ప్రతిరోజు వ్యాయామం అయిపోయిన అరగంటకి కానీ గంటకి కానీ స్నానం చేస్తే మంచిది.

ఈ మసాలా దినుసులు ఉపయోగించండి:

జీర్ణ సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే జీలకర్ర, ధనియాలు, అల్లం, పసుపు ఉపయోగించండి దీనితో ఆరోగ్యం బాగుంటుంది.

డిన్నర్ లైట్ గా చేయండి:

8 గంటల కంటే ముందు లైట్ గా డిన్నర్ చేయడం మంచిది.

నిద్ర:

మీరు నిద్రపోయే చోటు ఎంతో ప్రశాంతంగా శుభ్రంగా ఉంచుకోండి. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news