దిశ యాప్ పై హీరో ప్రశంసలు..!

-

ఏపీలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దిశ మొబైల్ యాప్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ యాప్ సహాయంతో ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని ఘటనలలో సమయానికి పోలీసులు చేరుకొని ఆపదలో ఉన్న మహిళలను రక్షించారు. దాంతో ఈ యాప్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో అడవి శేషు కూడా ఈ యాప్ పై ప్రశంసలు కురిపించారు. మహిళలు, విద్యార్థినులు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అడవి శేషు పిలుపునిచ్చారు.

విశాఖపట్నంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో అడవి శేషు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మహిళల రక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. అన్న లా మహిళలకు తోడుగా దిశ యాప్ ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అడవి శేషు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అడవి శేషు హీరోగా నటిస్తున్న మేజర్ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ సినిమా సీక్వెల్ లో అడవి శేషు హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news