IPL 2022 : ధోనీని తలపిస్తున్న బదోని..సిక్స్ తో ఫినిషింగ్

-

ఐపీఎల్ 2022 లో భాగంగా గురువారం ముంబైలోని డీ వై పాటీల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చిత్తు చేసింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రాణించింది.

దీంతో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ల‌క్నో సూపర్‌ జెయింట్స్ ఓడించింది. ఇది ఇలా ఉండగా.. లక్నో పేరు వినగానే అందరికీ.. ఆయూష్‌ బదోనీ పేరు మాత్రమే వినిపిస్తోంది. ప్రతి మ్యాచ్‌ లోనూ అలవోకగా సిక్సర్లు బాదుతూ.. జట్టుకు భారీ స్కోర్‌ ను అందిస్తున్నాడు.

ఇక నిన్నటి మ్యాచ్‌ లోనూ ఆఖరి వరకు క్రీజులో నిలిచాడు. 3 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌ తో అజేయంగా 10 పరుగులు చేసిన బదోని.. సిక్స్‌ తో మ్యాచ్‌ ను ఫినిష్‌ చేశాడు. అయితే… సిక్స్‌ తో మ్యాచ్‌ ను ఫినిష్‌ చేసిన బదోనీని.. నెటిజన్లు పొగుడుతున్నారు. టీమిండియాకు మరో ధోని దొరికాడంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. టీమిండియాలోకి బదోనిని తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news