ఆ మహిళను అంబటి రాంబాబు లైంగికంగా వేధించాడు : అయ్యన్న పాత్రుడు

-

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. అయితే తాజాగా.. ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్స్ చేశారు. దీంతో అయ్యన్న పాత్రుడు చేసిన ట్వీట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అంబటి రాంబాబు మహిళా జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు అయ్యన్న పాత్రుడు. అంబటి రాంబాబుకు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కోసం మహిళా జర్నలిస్ట్‌ వాట్సాస్‌ మెసేజ్‌ చేశారని, ఇంటర్వ్యూ ఇస్తే నాకేమిస్తావంటూ అంబటి రాంబాబు రిప్లై ఇచ్చారని ఆరోపించారు అయ్యన్న. అంతేకాకుండా.. త్వరలో ఈ వివరాలు ప్రపంచానికి తెలుస్తాయని అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.

Andhra Pradesh: Case filed against TDP leader Ayyanna Patrudu over indecent  remarks against chief minister

త్వరలో మంత్రి రాంబాబు బర్తరఫ్ కావడం ఖాయమన్న అయ్యన్న పాత్రుడు.. రాంబాబును ‘కాంబాబు’అంటూ ట్వీట్స్ చేశారు. రాంబాబు లైంగిక వేధింపుల వ్యవహారం సీఎంతో సహా అన్ని వ్యవస్థలకు చేరిందన్నారు. సూరీడు, జగన్ రెడ్డి అంటే మీకు కోపమొస్తుంది మరి కాంబాబు అనమంటావా? ఆడియోలో అడ్డంగా దొరికిపోయిన బ్రోకర్ నోరుమూసుకుని ఉండాలి. ఎగస్ట్రాలు చేస్తే ఇక వీడియోలే అంటూ ట్వీట్ చేసారు అయ్యన్న పాత్రుడు.

Read more RELATED
Recommended to you

Latest news